గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 29 డిశెంబరు 2023 (14:38 IST)

కళ్యాణ్ రామ్ "డెవిల్" మూవీ ఎలా ఉందంటే.. రివ్యూ

devil movie
కథానాయకుడు నందమూరి కళ్యాణ్ రామ్ లేటెస్ట్ మూవీ ‘డెవిల్’. ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ ట్యాగ్ లైన్. సంయుక్తా మీనన్, మాళవికా నాయర్ హీరోయిన్స్. అభిషేక్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై అభిషేక్ నామా ద‌ర్శ‌క నిర్మాత‌గా ఈ సినిమాను రూపొందించారు. డిసెంబ‌ర్ 29న విడుదలైంది.
 
కథ...
1947 కాలంనాటి కథ. బ్రిటిష్ పోలీస్‌కు వ్యతిరేకంగా నేషనల్ ఆర్మీని నెలకొల్పిన సుభాష్ చంద్రబోస్ ఇండియా నుంచి విదేశాలకు వెళతాడు. ఆయన తిరిగి వచ్చే క్రమంలో జరిగే కథ. బ్రిటిష్ ఏజెంట్‌గా పనిచేసే డెవిల్ (కళ్యాణ్ రామ్) మద్రాస్‌లోని ఓ దొర ఇంటిలో జరిగే మర్డర్ ఇన్వెస్టిగేషన్‌‍కు బ్రిటిష్ ఆఫీసర్ పిలిపిస్తాడు. ఆ పరిశోధనలో బోస్ సీక్రెట్ కోడ్ లీకేజీ జరుగుతుంది. అందుకే దొర ఇంటిలో మర్డర్ జరిగింది అని డెవిల్ అధికారులకు క్లారిటీ ఇస్తాడు. ఆ తర్వాత బోస్ కోసం పనిచేవారిని వెతికే క్రమంలో దొర మేనకోడలు సంయుక్త, బోస్ ఏజెంట్ అని తెలుస్తుంది. అప్పటికే ఆమెను ప్రేమించిన డెవిల్. ఏమి చేశాడు? అన్నది మిగిలిన కథ.
 
సమీక్ష...
కళ్యాణ్ రామ్ పాత్రలో పలు షేడ్స్ ఉన్నాయి. బోస్ రైట్ హ్యాండ్ త్రివర్ణ. అది మాలవికగా చూపిస్తారు. కానీ ఆమె కాదు. అదే ఈ సినిమాలో ట్విస్ట్. బోస్ తిరిగి ఇండియా వచ్చే క్రమంలో ఏమి జరిగింది. అనేది కల్పితంగా తీశారు. ఇక్కడ యుద్ధం కాదు ఊచకోత అని పోలీసులను తెగ నరికే సీన్ డెవిల్ చేస్తూ అంటాడు. దేశానికి ఫ్రీడమ్ కోసం ఎంతో మంది ప్రాణాలు ఫణంగా పెట్టారు. అవి ఇందులో చూపాడు. ఫ్రీడమ్‌కు ముందు జరిగిన కథ కాబట్టి. వస్త్ర, సెట్, పాత్రల ఎంపిక, సంభాషణ పరంగా జాగ్రత్తలు తీసుకున్నారు. 
 
ఇది ఓ మర్డర్ కేస్‌ను ఫ్రీడమ్‌కు లింక్ చేస్తూ తీశారు. దర్శకుడు‌గా నిర్మాత పేరు వస్తుంది. కనీసం టీమ్ అని వేసుకున్నా బాగుండేది. సినిమా విడుదలకు ముందు అసలు దర్శకుడికి. టీమ్‌‌కు మధ్య ఇగో క్లాష్ వచ్చిందని తెలిసిందే.
 
ఇక ఈ సినిమాలో కొన్ని లాగ్ సన్నివేశాలు కూడా ఉన్నాయి. ఒక్క ముక్కలో చెప్పేది చుట్టూరా తిప్పినట్టు చెబుతారు. ఇది ఏమైనా సరికొత్తగా ఈ సినిమా ఉంది. అయితే ప్రేక్షకుడు ఫీల్ అయ్యే విధంగా లేకపోవడం మైనస్‌గా చెప్పవచ్చు. చివరిగా.. ఈ టైటిల్ పేరు.. త్రివర్ణ అని పెడితే బాగుండేదని ప్రేక్షకుడికి అనిపిస్తుంది. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. 
 రేటింగ్.. 3/5