50 లక్షలు నష్టపోయిన పూరీకి బండ్ల గణేష్ 5 కోట్లు ఇప్పించాడా?

bandla ganesh
శ్రీ| Last Modified బుధవారం, 2 సెప్టెంబరు 2020 (19:56 IST)
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.. చాలా డబ్బు పోగొట్టుకున్నారని.. గతంలో స్వయంగా ఆయనే చెప్పారు. అప్పటి నుంచి డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నాను అని చెప్పారు. అయితే.. పూరి గురించి బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ ఓ విషయం బయటపెట్టారు. అది ఏంటంటే.. ఓ రోజు బండ్ల గణేష్.. పూరి ఆఫీస్‌కి వెళితే, కొన్ని డాక్యుమెంట్లు విసిరేసాడు. ఆ డాక్యుమెంట్లు తన కాలిపై పడ్డాయట. అందులో ఒకటి షాద్ నగర్ అని ఉందట.

ఏంటి ఈ డాక్యుమెంట్ అని అడిగితే... 50 లక్షలు పెట్టి కొన్నాను. మోసం చేసాడు అని చెప్పాడట.
అయితే.. ఈ డాక్యుమెంట్లు నేను తీసుకెళతాను. ప్రాబ్లమ్ క్లియర్ చేసి తీసుకువస్తాను అని చెప్పాను. ఆ లాండ్ ప్రాబ్లమ్ క్లియర్ చేసాను. ఆ లాండ్‌కి గాను 5 కోట్లు ఇచ్చాను అని బండ్ల గణేష్ చెప్పారు. పూరి గురించి ఇంకా చెబుతూ.. పూరి డైరెక్టర్ అవ్వక ముందు నుంచి తెలుసు.

కొంతమందికి కథలు చెప్పించాను కానీ.. వర్కవుట్ కాలేదు. అయితే... తను డైరెక్టర్ అయిన తర్వాత తన సినిమాల్లో అవకాశాలు ఇచ్చి ప్రొత్సహించేవాడని బండ్ల గణేష్ తెలియచేసారు. తను ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలనుకుంటే... అది పూరికి, పవన్ కళ్యాణ్‌‌కి అని చెప్పారు.దీనిపై మరింత చదవండి :