శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 8 నవంబరు 2024 (18:46 IST)

ఉద్యోగం కోసం ప‌డే పాట్ల నేప‌థ్యంలో ఈసారైనా? మూవీ

Eesarainaa-viplav
Eesarainaa-viplav
విప్లవ్ దర్శకత్వం వహిస్తూ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఈ సారైనా. విప్లవ్, అశ్విని, ప్రదీప్ రాపర్తి, మహబూబ్ బాషా, కార్తికేయ దేవ్, నీతు క్వీన్, సత్తన్న, అశోక్ మూలవిరాట్ నటీనటులుగా నటించారు. గ్రామీణ నేపథ్యంలో ఒక నిరుద్యోగ యువకుడు ప్ర‌భుత్వ ఉద్యోగం కోసం ప‌డే పాట్ల నేప‌థ్యంలో రూపొందిన ఈ సినిమా ఈరోజే విడుదలైంది. 
 
కథ :  ఓ ఊరిలో రాజు (విప్లవ్) డిగ్రీ పూర్తి చేసి ప్రభుత్వం ఉద్యోగం కోసం చేయాలనే ఎయిమ్ తో నాలుగేళ్ళు ఎదురుచూస్తుంటారు. ప్రభుత్వం నోటిఫికేషన్ ఎదురుచూస్తున్న అతనికి అదే ఊరిలో శిరీష (అశ్విని) గవర్నమెంట్ టీచర్. అయితే రాజు మూడుసార్లు ఉద్యోగం కోసం పోటీపడి ఓడిపోతాడు. ఆ టైంలో శిరీష తండ్రి రాజుకు ఓ సవాల్ విసురుతాడు. ఆ సవాల్ ను ఏవిధంగా రాజు స్వీకరించాడు. ఆ తర్వాత శిరీష, స్నేహితుడు మహబూబ్ బాషా అతని ఏవిధంగా అతని గట్టెక్కించే ప్రయత్నం చేశారు. దానికోసం రాజు ఏమి చేశాడు?  అసలు వీరిద్దరి మధ్యప్రేమ ఏ స్థాయిలో వుంది? అనేది మిగిలిన సినిమా కథ.
 
సమీక్షగా చెప్పాలంటే... ఈ సినిమాను ఐదారుగురు మోసారు. సినిమారంగంలో తనేంటో నిరూపించుకోవాలనుకున్న విప్లవ్ అన్నీ తానే అయి చేయడం విశేషం. అన్ని బాధ్యతలు తలమీద పెట్టుకుంటే ఎక్కడో చోట కొంచెం గాడి తప్పడం జరుగుతుంది. అయినా మొదటిసారి కథ ను దర్శకుబు బాగా చేయగలిగాడు. అదే క్రమంలో కొన్నిచోట్ల సాగదీత ధోరణిలో కథనం వుండడంతోపాటు బడ్జెట్ పరిమితులవల్ల నేమో సరైన ఆర్టిస్టులేకపోవడం ప్రధానలోపంగా చెప్పవచ్చు. 
 
ఇందులో హీరో విప్లవ్  తొలిసారి అయినా పల్లెటూరి కుర్రాడు ఏవిధంగా బిహేవ్ చేస్తాడో, గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నం చేసే క్రమంలో తను ఆలోచించే విధానంతో సాగే పాత్ర కనుక సరిపోయాడు. ప్రేమికులురాలు తన ప్రేమను గెలిపించేందుకు చేసిన ప్రయత్నం ఆదర్శంగా వుంది. ఈనాటి యువత ఈ విధంగా ఆలోచించి ప్రేమిస్తే బాగుంటుందనే పాయింట్ బాగుంది. తండ్రి పాత్రలో ప్రదీప్ రాపర్తి  నవ్విస్తూనే సీరియస్ గా బాగా నటించారు. మిగిలిన పాత్రలపరంగా మహబూబ్ బాషా, సత్తన్న, అశోక్ మూలవిరాట్ పరిధి మేరకు నటించారు. హీరో చిన్నప్పుటి పాత్రలో కార్తికేయ దేవ్, హీరోయిన్ చిన్నప్పటి క్యారెక్టర్ లో నీతు సుప్రజ అమరారు.
 
విప్లవ్ నిర్మాతగా ఎడిటర్ గానే కాకుండా తన సొంత ఊరిలో నిర్మించి లోకల్ వాతావరణాన్ని కలిగించాడు. గిరి సినిమాటోగ్రఫీ, తేజ్ అందించిన మ్యూజిక్ బాగానే వున్నాయి. ఇక గోరేటి వెంకన్న గారు, రాకేందు మౌళి, శరత్ చేపూరి రాసిన పాటలు క్యాచీగా అనిపిస్తాయి.
ఇలాంటి కథను వెండితెరపై ఆవిష్కరించడంలో కొంత మేర విప్లవ్ సక్సెస్ అనిపించినా మరింత కసరత్తు చేస్తే బాగుండేది. కాస్తో కూస్తో ఫేమ్ వున్నవారి నటిస్తే సినిమా మరోలా వుండేది. 
రేటింగ్ : 275/5