బిగ్‌బాస్ సీజన్ 7లో ఫ్యామిలీ టైమ్.. శివాజీకి సర్ ప్రైజ్
బిగ్‌బాస్ సీజన్ 7లో ఫ్యామిలీ టైమ్ వచ్చేసింది. ఈ వారం కంటెస్టెంట్ల ఫ్యామిలీని బిగ్‌బాస్ హౌజ్‌లోకి పంపిస్తున్నారు. దానికి సంబంధించిన తాజా ప్రోమో రిలీజ్ అయింది. చాలా ఎమోషనల్‌గా ఈ ప్రోమో సాగింది.
నిన్నంతా నామినేషన్ల లొల్లిలో హీట్‌లో ఉన్న కంటెస్టెంట్లకు బిగ్‌బాస్ చల్లని కబురును ఫ్యామిలీ రూపంలో తీసుకొచ్చారు. ప్రశాంత్, యావర్‌తో కూర్చొని శివాజీ ఛాయ్ తాగుతుండగా బిగ్‌బాస్ డాక్టర్ రూమ్‌కి రావాలని పిలిచారు.
దాంతో రెగ్యూలర్ చెకప్ కోసం అనుకుంటూ.. శివాజీ లోపలికి వెళ్లారు. హాథ్ కైసా అని డాక్టర్ ప్రశ్నించగా.. యా గుడ్ ఫీలింగ్ బెటర్ అని శివాజీ తెలిపారు. వ్యాయామాలు టైమ్‌కి చేస్తున్నారా? అని భుజానికి సంబంధించి అన్ని ప్రశ్నలు అడిగారు. ఇంకో మూడు రోజుల్లో ఇది తగ్గిపోతుందని చెప్పగా.. తగ్గాలని కోరుకుంటున్నాను.
గేమ్‌లో మరింత బాగా ఆడాలనుకుంటున్నా అని చెప్పి వెళ్లిపోతుండగా.. నాన్న అంటూ పిలిచి.. ఫేస్కున్న మాస్క్‌ను.. తలపై మాస్క్‌ను తీసి శివాజీ కొడుకు సర్ఫ్రైజ్ చేశారు. కొడుకును చూసిన సంతోషంలో శివాజీ బాగా ఎమోషనల్ అయిపోయాడు. కన్నీటి పర్యంతమైపోయాడు.
తర్వాత కొడుకుతో ప్రైవేట్‌గా కూర్చొని శివాజీ మాట్లాడారు. కొడుకును చూసిన శివాజీ కన్నీటి పర్యంతమయ్యాడు. నువ్వు ఏడ్వకు నాన్న.. నువ్వు ఏడిస్తే ఇంట్లో అందరూ ఏడుస్తారు. నువ్వు నవ్వితే ఇంట్లో అందరూ నవ్వుతారు. నువ్వు ఏడిస్తే అందరూ ఏడుస్తారని ఎమోషనల్ అవ్వగా.. ప్రోమో ముగుస్తుంది.