విద్యార్థులకు అలెర్ట్ : ఏపీలో 8న పాఠశాలలు, కాలేజీలు బంద్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పాఠశాలలు, కాలేజీలు మూతపడనున్నాయి. అనేక విద్యార్థి సంఘాలు సంయుక్తంగా ఇచ్చిన బంద్ పిలుపు మేరకు విద్యా సంస్థలు మూతపడనున్నాయి. ఫలితంగా ఏపీలోని అన్ని పాఠశాలలు, కాలేజీలు 8వ తేదీ బుధవారం మూతపడుతాయి.
విశాఖ ఉక్కు పరిరక్షణ, కడప ఉక్కు ఫ్యాక్టరీ సాధనకు మద్దతుగా ఈ బంద్ చేపడుతున్నట్టు ఏఐఎస్ఎఫ్, డీపీఎస్‌యూ, ఏఐవైఎఫ్ విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. బీజేపీ అనుబంధ విద్యార్థి విభాగమైన ఏబీవీపీ మాత్రం ఈ బంద్‌కు దూరంగా ఉంది.
అదేసమయంలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రారంభించిన పోరాటానికి నవంబరు 8వ తేదీ నాటికి వెయ్యి రోజులు పూర్తవుతుంది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ తీరును ఖండిస్తూ ఈ బంద్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ బంద్‌లో విద్యార్థులు, యువతు పాల్గొని విజయవంతం చేయాలని విద్యార్థి, యువజన సంఘాలు కోరారు.
తెలంగాణాలో బీజేపీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి అభ్యర్థిపై బీజేపీ క్లారిటీ!
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తే ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై ఆ పార్టీ సీనియర్ నేత మురళీధర రావు ఓ క్లారిటీ ఇచ్చారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న ఈయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ, టీబీజేపీ మాజీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ముఖ్యమంత్రి రేసులో ఉన్నారని చెప్పారు. ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీలో ఉన్నారు కాబట్టే తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తప్పించారని చెప్పారు.
అలాగే, ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి, ప్రస్తుత బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి మాత్రం ముఖ్యమంత్రి రేసులో లేరని స్పష్టంచేశారు. అందుకే ఆయనకు అధ్యక్ష బాధ్యతలు అప్పగించినట్టు చెప్పారు. అదేసమయంలో డిసెంబరు మూడో తేదీన వెల్లడయ్యే ఎన్నికల ఫలితాల తర్వాత తమ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుందని ఆయన జోస్యం చెప్పారు. అలాగే, బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన కోమటిరెడ్డి రాజోగోపాల్ రెడ్డి తిరిగి బీజేపీలోకి వస్తారని తెలిపారు.