గుండెపోటుతో 9వ తరగతి విద్యార్థిని మృతి
గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. తాజాగా గుజరాత్ రాష్ట్రంలో 9వ తరగతి చదువుతున్న బాలిక గుండెపోటుతో మృతి చెందడం కలకలం రేపుతోంది. రాష్ట్రంలోని అమ్రేలి నగరంలో 9వ తరగతి చదువుతున్న బాలిక పరీక్ష హాలులోనే కుప్పకూలింది.
బాలికను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు గుర్తించారు. మృతి చెందిన విద్యార్థిని రాజ్‌కోట్ జిల్లా జస్తాన్ తాలూకాకు చెందిన సాక్ష్ రాజోసరగా గుర్తించారు.