శుక్రవారం, 6 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : సోమవారం, 30 అక్టోబరు 2023 (14:54 IST)

110 రోజులు నిరాహార దీక్షతో 16 ఏళ్ల బాలిక రికార్డ్

warm water
16 ఏళ్ల జైన్ సామాజికవర్గానికి చెందిన బాలిక 110 రోజులు నిరాహార దీక్షతో రికార్డ్ సాధించింది. వివరాల్లోకి వెళితే ముంబైకి చెందిన జైన్ సమాజానికి చెందిన 16 ఏళ్ల క్రిష అనే బాలిక 16 రోజులు నిరాహార దీక్ష చేపట్టింది. 
 
అయితే 16 రోజులు పూర్తైనా ఆమె శరీరంలో ఎలాంటి సమస్యా ఏర్పడలేదు. ఆమె ఆధ్యాత్మిక గురువు అనుమతి పొంది 110 రోజుల పాటు ఈ దీక్ష కొనసాగించింది. 
 
ఉపవాస సమయంలో  క్రిష ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 06.30 గంటల వరకు కేవలం వేడి నీటిని మాత్రమే సేవించింది. ఇలా 110 రోజులు నిరాహార దీక్షను విజయవంతంగా ముగించి క్రిష బరువు 18 కిలోలు తగ్గినట్లు సమాచారం.