శనివారం, 12 అక్టోబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 4 ఫిబ్రవరి 2023 (22:36 IST)

ప్రతి ఆడపిల్ల నా కోడలు స్నేహాలా ఉండాలి : అల్లు అరవింద్‌

Allu aravind
Allu aravind
సుహాస్ హీరోగా నటించిన ‘రైటర్ పద్మభూషణ్‌ కు  నూతన దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టీనా శిల్పరాజ్ కథానాయిక. ఛాయ్ బిస్కెట్ ఫిల్మ్స్, లహరి ఫిల్మ్స్ బ్యానర్స్ పై అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహర్  నిర్మించిన ఈ చిత్రాన్ని  జి. మనోహర్ సమర్పించారు. ఫిబ్రవరి 3న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలయి విజయవంతంగా ప్రదర్సించబడుతోంది.
 
ఈ సందర్భంగా అల్లు అరవింద్‌ మాట్లాడుతూ,  నేను ఈ వయస్సులో ఇలా హుషారుగా వున్నానంటే నా దగ్గరకు కథలతో వస్తున్న యంగ్‌స్టర్‌తో పరిచయం వల్లే. ఈ సినిమా టైటిల్‌ వినగానే చేద్దామనిపించింది. ఇందులో ప్రత్యేక అంశం ప్రతి ఆడపిల్ల తల్లిదండ్రులు తప్పకుండా చూడాల్సిన సినిమా. ఆడపిల్లల మనస్సులో ఏముందో తెలుసుకోవాలంటే తల్లి దండ్రులు, సోదరులు ఈ సినిమా చూడాలి. అందుకే ఇది ఫ్యామిలీ సినిమా. క్లయిమాక్స్‌లో ఆడపిల్ల గురించి చెప్పిన విషయం చాలా ఆకట్టుకుంది. మా ఫ్యామిలీలో నా కోడలు స్నేహ రిచ్‌, స్టార్‌ హీరో భర్త అయినా ఖాళీగా కూర్చోదు. ఆమె వర్కింగ్‌ ఉమెన్‌గా పనిచేస్తుంది. అందుకే ప్రతి ఆడపిల్ల ఇంట్లో కూర్చోకుండా పనిచేయాలి. ఈ విషయం నాకు అప్పట్లో తెలీదు. ఈ సినిమా చూశాక నా భార్యను ఓ మాట అడిగాను. అప్పట్లో నువ్వు ఏమి అవ్వాలనుకున్నావని.. అంతలా నన్ను కదిలించింది ఈ సినిమా. కలర్‌ ఫొటో టైంలో పాండమిక్‌. తీసిన సినిమాను దాచుకోవాలంటే నిర్మాతల దగ్గర ఓపికలేదు. అందుకే ఆహా!లో విడుదల చేశాం. పెద్ద హిట్‌. సుహాస్‌లో అమాయకత్వంవుంది. దానితోనే బాగా యాక్ట్‌ చేశాడు. నా ఫ్రెండ్‌ మనోహర్‌ కొడుకు చంద్రు కావడం చాలా ఆనందంగా వుంది. ఇక ఫ్యామిలీ మెంబర్‌ బలభద్రు పాత్రుని రమణి మేనల్లుడు శరత్‌. తను 12 ఏళ్ళ క్రితం డిజిటల్‌ మార్కెట్‌ గురించి చెప్పాడు. అంత విజన్‌ వున్న వ్యక్తి. చాయ్‌ బిస్కెట్‌ పెట్టాడు. బన్నీవాసు, ధీరజ్‌ కూడా ఈ సినిమాపై పూర్తి నమ్మకంతో వున్నారు. ఇందులో నటించిన ప్రతి ఒక్కరినీ థ్యాంక్స్‌ అన్నారు.