సెంచరీ కొట్టిన 'సంక్రాంతి అల్లుళ్లు'
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌ల కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ఎఫ్-2. సంక్రాంతి పండుగగు, సంక్రాంతి అల్లుళ్ళుగా వీరు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అంటే వరుణ్, వెంకీలు తోడల్లుళ్ళుగా నటిస్తే వారి పెళ్లాలుగా మెహరీన్, తమన్నాలు నటించారు. ఈ చిత్రానికి పోటీగా స్టార్ హీరోల సినిమాలు విడుదలైనప్పటికి ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టించింది. సౌత్ బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డుల రారాజుగా నిలిచిన ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయనున్నట్టు ఇటీవల అఫీషియల్‌గా ప్రకటించారు.
బోనికపూర్, దిల్ రాజు సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రాన్ని అనీస్ బజ్మీ తెరకెక్కించనున్నాడు. అయితే తెలుగులో వెంకటేష్, వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలలో రూపొందిన కామెడీ ఎంటర్టైనర్ "ఎఫ్-2" ( ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్) ఆదివారంతో 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ప్రేక్షకులకి ధన్యవాదాలు తెలిపారు దర్శక నిర్మాతలు.
రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతంకి మంచి ఆదరణ లభించింది. పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్ వంటి సూపర్ హిట్ చిత్రాలు తెరకెక్కించిన అనీల్ రావిపూడి "ఎఫ్ 2" చిత్రాన్ని కూడా మంచి వినోదం అందించే చిత్రంగా తెరకెక్కించి సక్సెస్ అయ్యాడు. ఈ చిత్రంలో వెంకటేష్ ఫుల్‌లెంగ్త్ కామెడీతో ప్రేక్షకుల కడుపు చెక్కలు అయ్యేలా చేశాడు.