గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 22 డిశెంబరు 2021 (13:37 IST)

నాగచైతన్య నుండి రూ. 50 కోట్ల భరణమా?: నీ ఆత్మను దేవుడు దీవించు గాక అంటూ సమంత రిప్లై

విడాకుల తర్వాత భరణంగా మాజీ భర్త నాగ చైతన్య నుండి రూ. 50 కోట్లు తీసుకున్నారంటూ కొందరు నెటిజన్లు ఆరోపిస్తూ సమంతను ట్రోల్ చేస్తున్నారు. మంగళవారం నాడు ఒక నెటిజన్ ఇదే అంశంపై ఆమెను ట్రోల్ చేసాడు. మీరు ఓ పెద్దమనిషి నుండి రూ. 50 కోట్లు తీసుకున్నారంటూ ఆరోపించాడు. నాగ చైతన్య నుండి భరణం తీసుకున్నట్లు అతడు వ్యాఖ్యానించాడు.

 
సాధారణంగా ఇలాంటి కామెంట్లను పెట్టేవారిని చాలామంది బ్లాక్ చేస్తుంటారు. కానీ సమంత ఆ పని చేయలేదు. అతడికి రిప్లైగా... దేవుడు మీ ఆత్మను దీవించు గాక అంటూ ఘాటు సమాధానం పోస్ట్ చేసింది. అంతే.. అతడు అంతకుముందు పోస్ట్ చేసిన వ్యాఖ్యను డిలిట్ చేసాడు.

 
ఇకపోతే సమంత తాజాగా పుష్ప చిత్రంలో ఊ.. అంటావా ఐటెం సాంగ్‌తో ఆకట్టుకుంది. గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ‘శాకుంతలం’లో నటిస్తోంది. ఇంకా హాలీవుడ్ చిత్రాలను అంగీకరించినట్లు టాలీవుడ్ భోగట్టా.