సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 21 డిశెంబరు 2021 (12:43 IST)

అగ్రరాజ్యం అమెరికాలో ఒమిక్రాన్ తొలి మరణం

అగ్రరాజ్యం అమెరికాలో ఒమిక్రాన్ తొలి మరణం సంభవించింది. ఇప్పటికే యూకేలో కూడా ఈ వైరస్ సోకిన వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే. ఇపుడు అగ్రరాజ్యంలో ఈ వైరస్ సోకిన రోగి ఒకరు చనిపోయారు. అయితే ఈ వ్యక్తి కరోనా వ్యాక్సిన్ వేయించుకోలేదు. దీంతో ఇది ఒమిక్రాన్ తొలి మరణంగా అమెరికా ఆరోగ్య శాఖ పేర్కొంది. 
 
టెక్సాస్ రాష్ట్రం, హర్రిస్ కౌంటీలో సోమవారం ఓ వ్యక్తి ఒమిక్రాన్ వైరస్ సోకి చనిపోయినట్టు కౌంటీ ఆరోగ్య శాఖ వెల్లడించింది. అయితే, ఈ మరణంపై అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ విభాగం స్పందించేందుకు నిరాకరించింది. అలాగే, ప్రాణాలు కోల్పోయిన రోగి వయసు 50 నుంచి 60 యేళ్ల మధ్య ఉంటుందని కౌంటీ వైద్యాధికారులు వెల్లడించారు.