తొలి ఒమిక్రాన్ మృతి నమోదు.. ఎక్కడో తెలుసా?
ప్రపంచాన్ని వణికిస్తున్న ఒమిక్రాన్ వైరస్ సోకిన రోగి ఒకరు మరణించారు. ఇది తొలి కరోనా మరణం. ఈ మరణం కూడా బ్రిటన్‍లో నమోదైంది. ఈ విషయాన్ని ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ ధృవీకరించారు.
సోమవారం ఆయన వెస్ట్ లండన్‌లోని పడింగ్టన్ సమీపంలో ఏర్పాటు చేసిన ఓ వ్యాక్సిన్ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒమిక్రాన్ వైరస్ బారినపడి రోగి ఒకరు మృతి చెందడం చాలా బాధాకారమన్నారు.
"ఒమిక్రాన్ వేరియంట్ మధ్యరకం వెర్షన్ అని నేను అనుకుంటున్నాను. ఈ వేరియంట్ మరింత విస్తరించకుండా అదుపు చేయాల్సిన అవసరం ఎంతైనా వుంది. జనాల్లో ఇది ఎంత వేగంగా వ్యాపిస్తుందో గుర్తించాల్సివుంది. అదేవిధంగా ఈ వేరియంట్ కట్టడికి అందరికీ బూస్టర్ డోస్‌లు అందించడమే ఉత్తమం అనేది తన అభిప్రాయం' అని చెప్పుకొచ్చారు.