జాతీయ గణిత దినోత్సవం.. ఎప్పుడు జరుపుకుంటారు..?
సంఖ్యామానంలో అత్యంత కీలకమైన సున్నా ఆవిష్కరణ ప్రపంచ గణితశాస్త్రానికి భారతీయుల అద్భుత కానుక. గణితం అభివృద్ధిలో ప్రపంచవ్యాప్తంగా భారతీయుల పాత్ర ఎంతో ఉంది. సంఖ్యామానానికి పట్టుకొమ్మ అయిన సున్నా (0) ఆవిష్కరణే దీనికి నిదర్శనం.
శ్రీనివాస రామానుజన్ అయ్యంగార్ గొప్ప గణిత శాస్త్రవేత్త. 20వ శతాబ్దంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గొప్ప గణిత మేధావుల్లో ఒకరు. రామానుజన్ గణిత శాస్త్ర మేధోసంపత్తి అద్భుతమైంది. పదమూడేండ్ల నాటికే సొంతంగా సిద్ధాంతాలు రూపొందించడం ప్రారంభించారు.
గణితంలో ఆయన చేసిన కృషికి గుర్తుగా రామానుజన్ పుట్టినరోజును (134వ జయంతి) జాతీయ గణితశాస్త్ర దినంగా పాటిస్తున్నాం. గణితంపై ఆసక్తితో అత్యున్నత పరిశోధనల కోసం 1914 మార్చి 17న రామానుజన్ ఇంగ్లండ్‌కు చేరుకొని పరిశోధనలకు ఉపక్రమించారు. నిరంతర శ్రమతో 32 పరిశోధనా పత్రాలు సమర్పించారు.
అక్కడి ప్రతికూల వాతావరణ పరిస్థితుల ప్రభావం వల్ల రామానుజన్ అనారోగ్యం పాలయ్యారు. రామానుజన్ ఆరోగ్య పరిస్థితి విషమించ డంతో 1919 మార్చిలో స్వదేశానికి తిరిగివచ్చారు. 1920, ఏప్రిల్ 26న ఆయన కన్నుమూశారు.
శుద్ధ గణితంలో నంబర్ థియరీలోని రామానుజన్ పరిశోధనలు, స్ట్రింగ్ థియరీ, క్యాన్సర్ పరిశోధనల వంటి ఆధునిక విషయాల్లో ఉపయోగపడుతు న్నాయి. రామానుజన్ చివరిదశలో మ్యాక్-తీటా ఫంక్షన్స్‌పై చేసిన పరిశోధనలు ప్రసిద్ధమైనవి.