శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 21 డిశెంబరు 2021 (17:21 IST)

భారత అమ్ములపొదిలో ఎస్-400 అస్త్రం

S-400
భారత అమ్ములపొదిలో మరో అస్ర్తం వచ్చి చేరింది. రక్షణ రంగాన్ని మరింత పటిష్టం చేసే ఎస్-400లను మోహరిస్తోంది భారత సైన్యం. దీంతో పాకిస్తాన్, చైనా వెన్నులో వణుకు మొదలైంది. 
 
భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఎస్-400 ట్రయాంప్ గగనతల రక్షణ వ్యవస్థను బలిష్టం చేసే పనిలో పడింది. పంజాబ్ సెక్టారులో రష్యా సహకారంతో దిగుమతి చేసుకున్న ఎస్-400లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక ఎస్-400లు వైమానిక దాడులు తిప్పికొట్టేందుకు వినియోగిస్తారు. 
 
ఇప్పటివరకు రష్యా, చైనా, టర్కీలు మాత్రమే వీటిని వినియోగిస్తున్నాయి. దీంతో భారత రక్షణ వ్యవస్థను ద్విగుణీకృతం చేసే ఉద్దేశంతోనే ఇండియా వీటిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.