1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 21 డిశెంబరు 2021 (13:43 IST)

ఒమిక్రాన్ వల్ల ముప్పు.. కఠిన నిర్ణయాలు తీసుకోవాలి

ప్రపంచాన్ని కలవరపెడుతున్న ఒమిక్రాన్ వైరస్ వల్ల వచ్చే యేడాది కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫఅ టెడ్రోస్ అథనామ్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఒమిక్రాన్ వైరస్ ప్రపంచ వ్యాప్తంగా 90కి పైగా దేశాలకు వ్యాపించింది. అలాగే, పాజిటివ్ కేసుల సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ప్రపంచ దేశాలన్నీ కలిసి 2022 సంవత్సరంలో కరోనాను అంతం చేసేందుకు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందన్నారు. ఇందుకోసం ప్రపంచ దేశాలన్నీ సమాయత్తం కావాలని ఆయన కోరారు. 
 
ఒమిక్రాన్ వంటి కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చి కరోనా ప్రపంచంలో కలకలం సృష్టిస్తోందని ఆయన తెలిపారు. ఇంటువంటి సమయంలో పండగ వేల ఆంక్షలు కఠినంగా, తప్పనిసరిగా అమలు చేయాలని కోరారు. కొత్త వచ్చిన ఒమిక్రాన్ వేరియంట్ ఇతర వేరియంట్ల కంటే చాలా వేగంగా వ్యాపిస్తోందని ఆయన గుర్తుచేశారు.