శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 9 జనవరి 2025 (08:26 IST)

'గేమ్ ఛేంజర్' బెనిఫిట్ షోకు తెలంగాణ సర్కారు అనుమతి నిరాకరణ!!

game changer
'గేమ్ ఛేంజర్' సినిమా బెనిఫిట్ షోలకు తెలంగాణ ప్రభుత్వం నిరాకరించింది. రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా రేపు విడుదలవుతోంది. టిక్కెట్ ధరల పెంపునకు, బెనిఫిట్ షోల కోసం సినిమా బృదం విజ్ఞప్తి చేసింది. అర్థరాత్రి ఒంటి గంటకు పెంచిన ధరతో బెనిఫిట్ షోను అనుమించాలన్న విజ్ఞప్తిని ప్రభుత్వం తిరస్కరించింది. 
 
సినిమా విడదల రోజున ఉదయం 4 గంటల నుంచి ఆరు షోలకు అనుమతి ఇచ్చింది. సినిమా టిక్కెట్ ధరల పెంపునకు కూడా అనుమతి ఇచ్చింది. సినిమా విడుదల రోజున సింగిల్ స్క్రీన్‌లో రూ.100, మల్టీప్లెక్స్‌‍లో రూ.150 పెంపునకు అనుమతి ఇచ్చింది. జనవరి 11 నుంచి 19 వరకు ఐదు షోలకు సింగిల్ స్క్రీన్‌లో రూ.50, మల్టీప్లెక్స్‌లలో రూ.100 పెంపునకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులు జారీచేసింది.