ఆదివారం, 25 ఫిబ్రవరి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 11 జనవరి 2023 (15:47 IST)

భారతావళి గర్వించేలా గోల్డెన్‌గ్లోబ్స్ : రామ్‌చరణ్

Ram Charan,  Upasanakonidela
Ram Charan, Upasanakonidela
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ నల్లటి భారతీయ వేషధారణలో గోల్డెన్‌గ్లోబ్స్ అవార్డు కోసం లాస్ ఏంజెల్స్‌ రెడ్ కార్పెట్‌ స్వాగతం పలికింది. అక్కడ అంతర్జాతీయ మీడియా మరియు అభిమానులతో ఆయన సంభాషించారు. రామ్‌చరణ్ తో పాటు అతని భార్య  ఉపాసనకొణిదెల, ఎన్. టి. ఆర్, దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి మరియు సంగీత స్వరకర్త ఏం ఏం.  కీరవాణి ఉన్నారు. 80వ గోల్డెన్ గ్లోబ్స్‌లో విజేతల పూర్తి జాబితా  ఉంది, ఇక్కడ SS రాజమౌళి చిత్రం  RRR రెండు విభాగాల్లో నామినేట్ చేయబడింది, ఒకటి గెలుచుకుంది. లాస్ ఏంజెల్స్‌లో అవార్డుల ప్రదానోత్సవం నేడు జరిగింది.
 
Ramcharan at media center
Ramcharan at media center
గోల్డెన్‌గ్లోబ్స్ అవార్డుసందర్భంగా రామ్‌చరణ్  అంతర్జాతీయ మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు. భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడం గురించి మరియు ప్రపంచ సినిమా ఎలా కలిసి వస్తోంది అనే దాని గురించి ఆయన మాట్లాడారు. ప్రస్తుతం అఖిల భారతావళి మరోసారి గర్వించేలా చేసిన దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి పేరు మరో మారు భారత సినిమా దగ్గర మారుమోగుతోంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాంటి స్టార్స్ తో తాను చేసిన రీసెంట్ భారీ హిట్ అండ్ పీరియాడిక్ చిత్రం “రౌద్రం రణం రుధిరం” ప్రపంచ వ్యాప్తంగా అందుకోని ఫీట్ లేనట్టుగా తెలుగు ఆడియెన్స్ గర్వించేలా చేస్తుంది.