హెబ్బా పటేల్ స్పెషల్ సాంగ్.. కరోనా దెబ్బకు ''రెడ్'' వాయిదా (video)
"రెడ్'' చిత్రంలో నటి హెబ్బా పటేల్ ఓ ఐటెం సాంగ్‌ను చేసింది. అయితే కేవలం సాంగ్ లోనే కాకుండా ఈ సినిమాలో రెండు.. మూడు సన్నివేశాలలో కూడా హెబ్బా కనిపిస్తుందని సమాచారం. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ చిత్రం రిలీజ్ వాయిదా పడింది. ఈ చిత్రానికి దర్శకుడు కిషోర్ తిరుమల. ఈ మూవీలో రామ్ హీరోగా నటిస్తున్నాడు.
ఇకపోతే.. ఈ పాటను ఇప్పటికే రామోజీ ఫిల్మ్ సిటీలో రామ్ అండ్ హెబ్బా మీద షూట్ చేశారు. సాంగ్ అవుట్ ఫుట్ చాలా బాగా వచ్చిందట. తిరుమల కిషోర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేసుకుంది.
అన్నట్టు ఏప్రిల్ 9న ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ కరోనా దెబ్బకు సినిమా వాయిదా పడింది. కాగా ఈ సినిమాలో రామ్ సరసన నివేదా పేతురాజ్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా సమీర్ రెడ్డి ఛాయాగ్రహణం అందిస్తున్నారు.