సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 8 జనవరి 2020 (12:02 IST)

రాజమౌళి కోసం రంగంలోకి దిగిన గద్దర్... 'ఆర్ఆర్ఆర్' కోసం ఓ పాట

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం "ఆర్ఆర్ఆర్". జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు హీరోలుగా నటిస్తున్న ఈ మల్టీస్టారర్ చిత్రంలో ఒక హీరోయిన్‌గా అలియా భట్‌ను ఎంపిక చేశారు. మరో హీరోయిన్‌ను ఎంపిక చేయాల్సివుంది. 
 
ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్‌తో పాటు.. సముద్రఖని, ఒవీలియా, అలిసన్ డూడీ, రే స్టీవెన్ సన్ వంటి అనేక ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే జూలై 30వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. 
 
అయితే, ఈ చిత్రంలో కొమురం భీమ్ పాత్ర‌లో ఎన్టీఆర్ న‌టిస్తుండ‌గా, మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్ నటిస్తున్నారు. చరిత్రలోని రెండు పాత్రల మధ్య జరిగిన ఓ కల్పిత కథతో ఈ సినిమాను రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. 
 
తాజాగా చిత్రానికి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. ప్ర‌జా గాయ‌కుడు గ‌ద్ద‌ర్ ఈ సినిమాలో ఓ విప్ల‌వ గేయాన్ని రాసి పాడుతున్నారట‌. తెలంగాణ ప్రాంతానికి చెందిన కొమురం భీమ్‌గా న‌టిస్తున్న ఎన్టీఆర్ పాత్రకి సంబంధించి గద్దర్ పాట‌ని రాయ‌నున్న‌ట్టు తెలుస్తుంది. అయితే, ఈ వార్తల్లో నిజమెంతో చిత్ర యూనిట్ స్పందించాల్సివుంది.