శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By కుమార్
Last Updated : గురువారం, 4 ఏప్రియల్ 2019 (11:21 IST)

'సాహో'తో చిందేయనున్న బ్రిటిష్ పాప్ సింగర్ కైలీ

బాహుబలి సినిమా భారీ హిట్ అయిన తర్వాత ప్రభాస్‌ నటిస్తున్న చిత్రం ‘సాహో’. ఈ సినిమా భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రారంభం నుంచే ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.


అభిమానుల అంచనాలకు తగ్గట్లుగానే బాలీవుడ్, హాలీవుడ్‌కు చెందిన సాంకేతిక నిపుణులతో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇలా ఉండగా ఈ సినిమాలో ప్రముఖ హాలీవుడ్‌ పాప్ సింగర్ స్పెషల్ సాంగ్‌లో నటించనున్నట్లు తెలుస్తోంది.
 
సాహోలో స్పెషల్ సాంగ్ కోసం బ్రిటీష్ పాప్ సింగర్ కైలీ మినోగ్‌‌ను సంప్రదించారట. ఆమె కూడా దీనికి అంగీకరించినట్లు సమాచారం. కైలీ 2009లో అక్షయ్ కుమార్ హీరోగా వచ్చిన ‘బ్లూ’ సినిమాలో స్పెషల్ సాంగ్‌లో నటించింది, దాదాపు పదేళ్ల తరువాత మరో భారతీయ సినిమాలో తళుక్కుమంటోంది.

కాగా ‘సాహో’లో ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ నటిస్తుండగా జాకీ ష్రాఫ్, నీల్ నితిన్ ముఖేశ్, అరుణ్ విజయ్ తదితరులు ముఖ్యమైన పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. ఈ సినిమాకు బాలీవుడ్ త్రయం శంకర్-ఇషాన్-లాయ్ సంగీతం అందిస్తున్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగష్టు 15న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.