శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: బుధవారం, 7 ఆగస్టు 2019 (21:45 IST)

రామ్ సినిమా క్యాన్సిల్ అయ్యిందా..? ఇది నిజ‌మేనా..?

ఎన‌ర్జిటిక్ హీరో రామ్ ఇస్మార్ట్ శంక‌ర్ సినిమాతో బ్లాక్ బ‌ష్ట‌ర్ సాధించి సెన్సేష‌న్ క్రియేట్ చేసిన విష‌యం తెలిసిందే. త‌దుప‌రి చిత్రాన్ని నేను శైల‌జ‌, చిత్ర‌ల‌హ‌రి చిత్రాల ద‌ర్శ‌కుడు కిషోర్ తిరుమ‌ల‌తో చేయాల‌నుకున్నారు. ఈ మూవీని స్ర‌వంతి మూవీస్ బ్యాన‌ర్ పై స్ర‌వంతి రవి కిషోర్ నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి.
 
అయితే.. ఇస్మార్ట్ శంక‌ర్ స‌క్స‌స్‌ని ఎంజాయ్ చేస్తున్న రామ్ త‌దుప‌రి చిత్రం విష‌యంలో ఆలోచ‌న‌లో ప‌డ్డాడ‌ట‌. ఎందుకంటే... ఇస్మార్ట్ శంక‌ర్ సినిమా రామ్‌కి మాస్‌లో మంచి ఫాలోయింగ్ తీసుకువ‌చ్చింది. దీంతో నెక్ట్స్ మూవీని కూడా మాస్ మూవీనే చేయాల‌నుకుంటున్నాడ‌ట‌. 
 
మాంచి మాస్ మూవీ స్టోరీ కోసం చూస్తున్నాడ‌ట‌. అందుచేత కిషోర్ తిరుమ‌ల‌తో చేయాల‌నుకున్న త‌మిళ సినిమా త‌డం రీమేక్ ప్రాజెక్ట్‌ను ఆపేసార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ప్ర‌చారంలో ఉన్న ఈ వార్త‌లపై రామ్ స్పందిస్తారేమో చూడాలి.