గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 10 ఫిబ్రవరి 2022 (10:10 IST)

నేటి సమాజంలో విడాకులు ఓ సర్వసాధారణం : హీరో సుమంత్

నేటి సమాజంలో విడాకులు అనేవి సర్వసాధారణంగా మారిపోయాయని అక్కినేని ఫ్యామిలీకి చెందిన హీరో సుమంత్ అన్నారు. ఈయల కెరీర్ పీక్ దశలో ఉండగా, హీరోయిన్ కీర్తి రెడ్డిని పెళ్ళి చేసుకున్నారు. ఆ తర్వాత వారిద్దిర మధ్య ఏర్పడిన మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకున్నారు. 
 
ఇదిలావుంటే, ఇంటీవలి కాలంలో పలువురు సినీ సెలెబ్రిటీలు విడాకులు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ అంశంపై ఆయన స్పందిస్తూ, నేటి కాలంలో విడాకులు అనేది ఓ కామన్‌గా మారిపోయిందన్నారు. అందువల్ల వీటి గురించి పెద్దగా చర్చించాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు. 
 
ఇకపోతే తన మాజీ భార్య కీర్తి రెడ్డితో ఇప్పటికీ తనకు మంచి స్నేహం కొనసాగుతుందని చెప్పారు. వివాహం జరిగిన రెండేళ్ళకే మేం కలిసివుండటం సాధ్యంకాదని తేలింది. అందువల్ల విడిపోవడమే మంచిదని భావించి విడాకులు తీసుకుననట్టు చెప్పారు. ప్రస్తుతం ఆమె ఇద్దరు పిల్లలతో హాయిగా సంసార జీవితాన్ని అనుభవిస్తుందన్నారు. అయితే, తన రెండో పెళ్లిపై మాత్రం సుమంత్ స్పందించలేదు.