శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 30 మే 2022 (17:21 IST)

ఇంటర్వ్యూ లైవ్‌లోనే కన్నీళ్లు పెట్టుకున్న కృతిశెట్టి.. ఎందుకో తెలుసా?

Kriti Shetty
ఉప్పెన సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కృతిశెట్టి టాలీవుడ్ టాప్ హీరోయిన్ల ఒకరిగా నిలిచింది. ఉప్పెన సక్సెస్‌తో కృతికి వరుసగా అవకాశాలు వస్తున్నాయి. నాగచైతన్యకు జంటగా బంగార్రాజు సినిమాలో కూడా ఆమె నటించింది. ఆ తర్వాత శ్యామ్ సింగరాయ్‌ సినిమాలో కూడా నటించి సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా మారింది.

 
 
తాజాగా కృతిశెట్టి సుధీర్ బాబుతో "ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి", రామ్‌కు జోడీగా "ది వారియర్‌", నితిన్ సరసన "మాచర్ల నియోజకవర్గం" చిత్రాలు చేస్తోంది. అలాగే కోలివుడ్‌లో సూర్యతో కలిసి 41వ చిత్రంలో హీరోయిన్‌గా కూడా చేస్తోంది. అయితే ఈక్రమంలో తమిళనాట కృతి శెట్టి ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. 

 
ప్రాంక్‌స్టర్లు ఆశిక్, సారథిరన్ కృతిని ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో కృతి కన్నీళ్లు పెట్టుకుంది. యాంకర్ల ప్రవర్తన చూసి ఆమె ఎమోషనల్ అయిపోయింది. 

 
అంతేకాదు.. హీరోయిన్ ఎదుటే కొట్లాకు కూడా దిగారు. దాంతో ఏం జరుగుతుందో తెలియక కృతి భయపడిపోయింది. ఆ తర్వాత వారు ప్రాంక్ అనడంతో ఊపిరి పీల్చుకున్న కృతి.. మొదట నవ్వినా ఆపై దుఖం ఆపుకోలేక లైవ్‌లోనే ఏడ్చేసింది. దాంతో ఆమెకు సర్దిచెప్పారు సదరు యాంకర్లు.. ఆ తర్వాత ఎందుకు ఏడ్చారు, ఏమైంది అని ప్రశ్నించారు.

 
అందుకు కృతి ఎవరైనా కఠినంగా మాట్లాడితే తనకు అస్సలు నచ్చదని, భయం వేస్తుందని చెప్పుకొచ్చింది. మొత్తానికి కృతి ఏడుస్తున్న వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.