విడాకులిచ్చాక మాజీభర్త ముఖం ఎలా చూస్తారో?: సోనియా అగర్వాల్ ప్రశ్న
సోనియా అగర్వాల్. 7జి బృందావన్ కాలనీ చిత్రంతో పాపులారిటీ సాధించిన ఈ హీరోయిన్ పెళ్లయ్యాక సినిమాల్లో ఫెయిల్ అయ్యింది. అడపాదడపా చిన్నచిన్న పాత్రల్లో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు. ఇటీవల తన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుతూ... తను పెళ్లాడిన సెల్వ రాఘవన్ జీవితంలో చాలా ప్రశాంతంగా వుంటాడనీ, ఐతే మొండిపట్టుదల వున్నవాడని తెలిపింది. అతడితో ఓ విషయంలో తేడా వచ్చాక విడాకులు తీసుకున్నాననీ, విడాకులు తీసుకున్నాక ఇక జీవితంలో అతడి ముఖం చూడకూడదని అనుకున్నట్లు చెప్పింది.
కానీ కొందరు విడాకులు తీసుకున్న తర్వాత కూడా తమ మాజీభర్తను స్నేహితుడుగా దగ్గరికి చేరదీస్తుంటారనీ, అది వాళ్లకి ఎలా సాధ్యపడుతుందో తనకు అర్థం కావడంలేదని చెప్పింది సోనియా అగర్వాల్. మరి ఈ కామెంట్లు ఎవరిని ఉద్దేశించి చేసిందో??