శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 29 మే 2023 (16:50 IST)

నాకు అహం ఎక్కువ, చిత్రం 2 నే అహింస : ఆర్..పి. పట్నాయక్‌

R..P. Patnaik
R..P. Patnaik
సంగీత దర్శకుడిగా ఆర్‌.పి. పట్నాయక్‌ అందరికీ తెలిసిందే. దర్శకుడు తేజ కాంబినేషన్‌లో నువ్వు నేను నుంచి పలు సినిమాలకు కలిసి పనిచేశారు. కొంతకాలం జర్నీ చేశాక ఇద్దరూ విడిపోయారు. ఇందుకు పరిస్థితులు కారణం అని చెప్పినా, కొన్ని విషయాల్లో నాకు అహం ఎక్కువ అనిఆర్‌.పి. పట్నాయక్‌ నిర్మొహమాటంగా చెప్పారు. గతంలో తేజకూ, మీకు ఈ విషయంలో క్లాష్‌ వచ్చింది ఎలా కలిశారు అంటే..  
 
నన్ను మ్యూజిక్‌ డైరెక్టర్‌గా కంటెన్యూ చేయమని స్వర్గీయ బాలసుబ్రహ్మణ్యం గారు కనిపించినప్పుడల్లా అడుగుతుండేవారు. టైం కోసం చూశాను. ఆయన నాకు బాగా కావాల్సినవాడు. ఆయన వల్లే సినిమా రంగంలోకి వచ్చాను. ఆయన చనిపోయినా ఆయన మాటలు నన్ను వెంటాడుతూనేవున్నాయి. అందుకే ఓసందర్భంలో తేజగారిని కలిశాను. మేం కలిసినప్పుడు క్యాజువల్‌గానే మాట్లాడుకున్నాం. గతం గురించి పెద్దగా చర్చ రాలేదు. చిత్రం 2 చేద్దాం అన్నారు. అదే  అహింస గా మారింది. అందుకే మా వేవ్‌ లెంగ్త్‌లు కలిసి అహింస అనే సినిమా చేశామని తెలిపారు. రానా సోదరుడు అభిరామ్‌ హీరోగా నటించిన ఈ సినిమా జూన్‌2న విడుదలకాబోతుంది.