ఆదివారం, 26 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 25 జులై 2022 (17:18 IST)

స్వ‌యం వ‌రంలో నేను మిస్ అయ్యాను -ర‌వితేజ - టికెట్ ధ‌ర‌లు ప్ర‌క‌టించిన ద‌ర్శ‌కుడు

Venu Thottempudi, Raviteja, Nani, Sarath Mandava, Bobby, Rajisha Vijayan and others
Venu Thottempudi, Raviteja, Nani, Sarath Mandava, Bobby, Rajisha Vijayan and others
వేణు తొట్టెంపూడితో నేను `స్వయంవరం` సినిమా చేయాలి. కానీ మిస్ అయ్యింది. మళ్ళీ కలిశాం. ఇంక గ్యాప్ ఇవ్వద్దు- అని ర‌వితేజ అన్నారు. రామారావు ఆన్ డ్యూటీస ప్రీరిలీజ్ వేడుక హైద‌రాబాద్‌లో జ‌రిగింది. 
 
ఈ సంద‌ర్భంగా  రవితేజ మాట్లాడుతూ.. 'నాకు చాలా డిఫరెంట్ మూవీ. డిఫరెంట్ క్యారెక్టరైజేషన్. ఇంతకుముందు ఎప్పుడూ చేయనిది. దర్శకుడు శరత్ చాలా అద్భుతమైన సినిమా తీశాడు. నిర్మాత సుధాకర్ నాకు మంచి స్నేహితుడు. కూల్, పాజిటివ్ పర్శన్. అలాంటి వారితో ఎన్ని సినిమాలైన చేయడానికి నేను రెడీ. సుధాకర్, శ్రీకాంత్ లకు అల్ ది బెస్ట్. ఈవెంట్ కి వచ్చిన దర్శకుడు బాబీకి థాంక్స్. నాని అంటే నాకు చాలా ఇష్టం. సౌత్ ఇండియాలోనే నాని మంచి నటుడు. రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్ లు బ్యూటీఫుల్ గా వుంటారు. సీసా పాటలో అన్వేషి జైన్ అలరిస్తుంది. ఈ పాట చాలా బాగా వచ్చింది.  జులై 29న 'రామారావు ఆన్ డ్యూటీ థియేటర్ కి వస్తుంది, అంతా థియేటర్ లో కలుద్దాం'' అన్నారు.
 
నాని మాట్లాడుతూ.. రవితేజ గారు చిరంజీవి గారిని ఇన్స్ ప్రేషన్ గా తీసుకున్నారు. మేము కెరీర్ మొదలుపెట్టినపుడు రవితేజ గారు మాకు ఇన్స్ ప్రేషన్.  చిరంజీవి గారి కార్వాన్ లోకి రవితేజ గారు ఎంటర్ అవ్వడం చూసినపుడు.. రవితేజ కార్వాన్ లోకి త్వరలోనే నేను ఎంటరవ్వాలనిపించింది. రవితేజ గారి మాటల్లో ఎంతో ప్రేమ వుంటుంది. సినిమా బావుంటే ఆయన ప్రత్యేకంగా ఫోన్ చేసి అభినందిస్తారు. 'రామారావు ఆన్ డ్యూటీ' కి చాలా పాజిటివ్ వైబ్ వుంది. నా 'దసరా' సినిమా చేస్తున్న నిర్మాతలే ఈ సినిమా చేస్తున్నారు.  ఇరవై ఏళ్ల నుండి రవితేజ ఆన్ డ్యూటీ. 29 నుండి రామారావు ఆన్ డ్యూటీ'' అన్నారు.
 
దర్శకుడు శరత్ మండవ మాట్లాడుతూ, ధరలు ఎక్కువగా వుండటం వలన ప్రేక్షకులు థియేటర్‌కి రావడం లేదని కొందరు చెబుతున్నారు.  'రామారావు ఆన్ డ్యూటీ' టికెట్లు సాధారణ ధరలకే అందుబాటులో వుంటాయి. తెలంగాణలోని  మల్టీ ఫ్లెక్స్ లో 195, సింగెల్ స్క్రీన్స్ లో 150, 100, 50 రూపాయిలు. ఆంధ్రప్రదేశ్ లో రేట్లు ప్రభుత్వం చేతిలో వుంటాయి. అక్కడ 177, 147, 80 రూపాయిలుగా టికెట్ ధరలు వున్నాయి. థియేటర్ లో చూడాల్సిన సినిమా ఇది. మీరంతా తప్పకుండా థియేటర్లో సినిమా చూడాలి'' అని కోరారు.
 
దర్శకుడు బాబీ మాట్లాడుతూ, రవితేజగారు తన డ్యూటీ సరిగ్గా చేశారు. మనం కూడా 29న థియేటర్లో సినిమా చూసి మన డ్యూటీ చేద్దాం. మాస్ మహారాజాని పట్టుకుంటే లైఫ్ సెటిల్ అయిపోతుంది. మాలాంటి వాళ్ళ స్థాయి రేంజ్ రోవర్ వరకూ సెట్ అయిపోతుంది.  దానికి నేనే పెద్ద ఉదాహరణ, 'బలుపు' సినిమాకి  ముందు వరకు ఒకలా వుండేది జీవితం. తర్వాత ఆయనకి కథ చెప్పిన తర్వాత మరో లా వుంది. పవన్ కళ్యాణ్ గారితో చేసిన సర్దార్ గబ్బర్ సింగ్ అనుకున్న స్థాయిలో రాణించలేదు. రవితేజ గారు ఫోన్ చేసిన అబ్బాయి కథ చెప్తావా.. నన్ను సెట్ చేయమంటావా ? అని అన్నారు. సెట్ చేయడమే కాదు రిసెట్ చేస్తుంటారాయన. సర్దార్ తర్వాత రవితేజ గారితో సినిమా చేయాలి. కానీ ఎన్టీఆర్ గారితో సినిమా కుదిరింది. రవితేజ గారు చాలా గొప్ప మనసుతో ''ముందు ఎన్టీఆర్ సినిమా చేయ్. ఎన్టీఆర్ చాలా అద్భుతమైన నటుడు. నీ లైఫ్ ఇంకా స్పీడ్ అవుతుంది'' అని  చెప్పారు. అది ఆయనలోని గొప్పదనం. నా డ్రీం ప్రాజెక్ట్ మెగా 154 కి కథ చెప్పగానే రవితేజ గారు అంగీకరించి జాయిన్ అయ్యారు. మెగా 154లో రవితేజ గారిది షాలిడ్ క్యారెక్టర్. రవితేజ గారి ఫ్యాన్స్ విజల్స్ వేనుసుకునేలా వుంటుంది'' అన్నారు.
 
వేణు తొట్టెంపూడి మాట్లాడుతూ.. నా మిత్రుడు రవితేజకి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆయన సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్నాను. నా పై నమ్మకం పెట్టుకొని అవకాశం ఇచ్చిన సుధాకర్, శ్రీకాంత్ గారికి, దర్శకుడు శరత్ మండవ గారికి థాంక్స్.అన్నారు.
 
రజిషా విజయన్ మాట్లాడుతూ..   'రామారావు ఆన్ డ్యూటీ' తో తెలుగులో అడుగుపెట్టడం ఆనందంగా వుంది. మాళిని లాంటి మంచి పాత్ర ఇచ్చిన దర్శకుడు శరత్ గారికి, నిర్మాత సుధాకర్ గారికి కృతజ్ఞతలు. రవితేజ గారు గ్రేట్ కోస్టార్.  29న సినిమా థియేటర్ కి వస్తుంది. థియేటర్ లో చూడాల్సిన సినిమా ఇది. అందరూ థియేటర్ కి వచ్చి సినిమా చూడాలి'' అని కోరారు.
 
దివ్యాంశ కౌశిక్ .. ఈ చిత్రంలో అవకాశం ఇచ్చిన రవితేజ, దర్శకుడు శరత్ మండవ, నిర్మాత సుధాకర్ చెరుకూరి గారికి కృతజ్ఞతలు. రవితేజ గారి సినిమాలో చేయడం గ్రేట్ ఎక్స్ పీరియన్స్. ఈ సినిమా అద్భుతంగా వచ్చింది. 29న మీ ముందుకు వస్తుంది. అందరూ థియేటర్ లో సినిమా చూడాలని కోరుకుంటున్నాను.
 
సంగీత దర్శకుడు సామ్ సిఎస్ మాట్లాడుతూ..  'రామారావు ఆన్ డ్యూటీ' అద్భుతమైన కథ, స్క్రీన్ ప్లేయ్. ఈ కథకి సంగీత ప్రాధన్యత కూడా వుంది. మ్యజికల్ గా నా బెస్ట్ ఇచ్చాను. మీ అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను.  ఇంత మంచి సినిమా ఇచ్చిన రవితేజ, దర్శకుడు శరత్ మండవ, నిర్మాత సుధాకర్ చెరుకూరి గారికి కృతజ్ఞతలు. రవితేజ గారు అద్భుతమైన మనిషి, ఆయనతో మరిన్ని సినిమాలు చేయాలనీ వుంది. సినిమా అద్భుతంగా వచ్చింది. మీ అందరికీ నచ్చుతుంది' అన్నారు.