మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శుక్రవారం, 2 నవంబరు 2018 (17:40 IST)

రూ.159 రీచార్జ్... 28 జీబీతో డేటా...

దేశీయ టెలికాం రంగంలో సేవలు అందిస్తున్న ప్రైవేట్ కంపెనీల్లో ఒకటైన ఐడియా సెల్యూలార్ కంపెనీ తాజాగా సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది. రూ.159 రీఛార్జ్‌తో 28జీబీ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లను వినియోగదారులకు అందించనున్నట్లు వెల్లడించింది. అయితే, ఇది కేవలం ముంబై ప్రీపెయిడ్ కస్టమర్ల కోసమే. 
 
నిజానికి ఇటీవల వొడాఫోన్ ఇండియా రూ.159 ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. వొడాఫోన్-ఐడియా విలీనం తర్వాత వొడాఫోన్ ఐడియా లిమిటెడ్‌గా అవతరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు బ్రాండ్‌ల వినియోగదారులకు ఒకే రకమైన టారిఫ్‌లను అందించేందుకు ఉమ్మడి సంస్థ సన్నాహాలు చేస్తోంది.
 
ఇందులోభాగంగా, ఐడియా ఈ ఆఫర్ను ప్రకటించింది. ఈ ప్లాన్ 28 రోజుల కాలపరిమితి కలిగివుంటుంది. అలాగే, 28 జీబీ డేటాను ఇవ్వనుంది. ఎఫ్‌యూపీ కింద రోజుకు 250 నిమిషాలు, వారానికి 1000 నిమిషాలు మాత్రమే వాయిస్ కాలింగ్ చేసుకోవచ్చు. రిలయన్స్ జియోలోను దాదాపు ఇవే బెనిఫిట్స్ లభిస్తున్నాయి. 
 
రూ.149 రీఛార్జ్‌తో 28 రోజుల పాటు అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు, రోజుకు 1.5జీబీ డేటాను అందిస్తోంది. ఐడియా సెల్యూలార్‌లో 4జీ నెట్‌వర్క్ కనెక్టివిటీ ఉన్నప్పటికీ లోకేషన్ ఆధారంగా ఆటోమేటిక్‌గా కొన్నిసార్లు 4జీ నెట్‌వర్క్ నుంచి 3జీ లేదా 2జీకి మారుతూ ఉంటోంది. కానీ జియో అందుబాటులో ఉన్న అన్ని సర్కిళ్లలోనూ యూజర్లు 4జీ నెట్‌వర్క్‌నే వినియోగించుకునే వెసులుబాటు ఉంది.