1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 16 జూన్ 2018 (15:53 IST)

రూ.99 ప్లాన్‌లో మార్పులు చేసిన ఎయిర్‌టెల్.. జియో దెబ్బకు...

రిలయన్స్ జియో దెబ్బకు ప్రైవేట్ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ ధరల విషయంలో రోజురోజుకూ దిగివస్తోంది. తనకంటే ప్రత్యర్థి కంపెనీ రిలయన్స్ సేవలపై తమ కస్టమర్లు మొగ్గు చూపుతుండటంతో వారిని కాపాడుకునేందుకు వీలుగా త

రిలయన్స్ జియో దెబ్బకు ప్రైవేట్ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ ధరల విషయంలో రోజురోజుకూ దిగివస్తోంది. తనకంటే ప్రత్యర్థి కంపెనీ రిలయన్స్ సేవలపై తమ కస్టమర్లు మొగ్గు చూపుతుండటంతో వారిని కాపాడుకునేందుకు వీలుగా తన ప్లాన్‌లలో మార్పులు చేస్తోంది.
 
ఇందులోభాగంగా, ఎయిర్‌టెల్ తన రూ.99 ప్రీపెయిడ్ ప్లాన్‌లో మార్పులు చేసింది. ఈ మార్పుల మేరకు ఇకపై నెలకు 2జీబీ డేటా ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఈ ప్లాన్ కాలపరిమితి 28 రోజులు. 
 
నిజానికి ఇప్పటివరకు రూ.99 ప్లాన్‌లో నెలకు ఒక జీబీ డేటా మాత్రమే ఉచితం. రిలయన్స్ జియో రూ.98 ప్లాన్‌లో నెలకు 2జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, రోజూ 100 ఎస్ఎంఎస్‌లను ఆఫర్ చేస్తోంది. 
 
దీంతో ఎయిర్‌టెల్ కూడా దిగివచ్చింది. రూ.99 ప్లాన్‌ను అప్‌గ్రేడ్ చేసింది. ఇందులో అన్ లిమిటెడ్ కాల్స్, రోజూ 100 ఎస్ఎంఎస్‌లను కూడా ఉచితంగా అందివ్వనుంది. బీఎస్ఎన్ఎల్ కూడా ఇదే ప్లాన్ కింద రోజుకు 1.5జీబీ డేటాను అందిస్తున్న విషయం తెల్సిందే.