గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 19 నవంబరు 2020 (17:39 IST)

రోడ్ జర్నీ కాన్సెప్టుతో తెరకెక్కుతున్న 'ఇదే మా కథ'

యువ హీరో సుమంత్ అశ్విన్, శ్రీకాంత్, భూమిక, తాన్యా హోప్ ప్రధాన పాత్రలలో న‌టిస్తున్నచిత్రం "ఇదే మా కథ" (రైడర్స్ స్టోరి అనేది ఉపశీర్షిక). రోడ్ జర్నీ కాన్సెప్టుతో తెరకెక్కుతున్నఈ చిత్రానికి గురుపవన్ దర్శకుడు. ఎన్‌.సుబ్ర‌హ్మ‌ణ్యం ఆశిస్సుల‌తో శ్రీమతి మనోరమ గురప్ప సమర్పణలో గురప్ప పరమేశ్వర ప్రొడక్షన్స్ పతాకంపై జి.మహేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 
 
ఈ రోజు హైద‌రాబాద్ ప్ర‌సాద్‌ ల్యాబ్‌లో ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో 'ఇదే మా కథ ఫస్ట్' లుక్ పోస్టరుని విడుదల చేసింది చిత్ర యూనిట్. ఇందులో ప్ర‌ధాన పాత్ర ధారులు రైడర్స్ గెటప్‌లో బైక్ మీద రైడింగ్ కి వెళ్తున్నట్లు కనిపిస్తున్నారు. 
 
ఈ సంద‌ర్భంగా ప్రొడ్యూస‌ర్ జి.మహేష్ మాట్లాడుతూ, ఇది మ‌నంద‌రి క‌థ‌. ఇందులో నా క‌థ కూడా ఉంది. అందుకే సినిమా రిలీజ్ కోసం నేను కూడా  ఈగ‌ర్‌గా వెయిట్‌చేస్తున్నాను. చాలా ఎమోష‌న్స్‌తో ట్రావెల్ అయ్యే స్క్రిప్ట్‌. త‌ప్ప‌కుండా అంద‌రికీ న‌చ్చుతుంది అన్నారు.
 
ద‌ర్శ‌కుడు గురుపవన్ మాట్లాడుతూ, లాక్డౌన్‌కి ముందే షూటింగ్ స్టార్ట్ చేసి లడఖ్ తదితర ప్రాంతాల్లో షూటింగ్ చేశాం. ఈ సినిమా.. లాక్డౌన్ స‌మ‌యంలో అంద‌రిలాగే మా టీమ్ కూడా కొంత నిరాశ‌కు గుర‌య్యాం. అయితే మళ్లీ సాధార‌ణ పరిస్థితులు నెల‌కోవ‌డంతో అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ హైద‌రాబాద్ షెడ్యూల్ పూర్తిచేశాం.

ఇంకా మ‌నాలి షెడ్యూల్ బ్యాలెన్స్ ఉంది. డిసెంబ‌ర్‌లో షూటింగ్ పూర్తిచేస్తాం. ఇప్పటివరకు చేయని పాత్రల్లో సుమంత్ అశ్విన్, శ్రీకాంత్ కనిపిస్తున్నారు. సునీల్ కశ్యప్ సంగీతం సమకూరుస్తున్నారు. నేను కూడా ఒక రైడ‌ర్‌ని అందుకే ఆ బ్యాక్‌డ్రాప్‌లో క‌థ రాయ‌డం జ‌రిగింది. ఇది రైడ‌ర్స్ స్టోరి త‌ప్ప‌కుండా న‌చ్చుతుంది అన్నారు. 
 
హీరో సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ, ఇలాంటి డిఫిక‌ల్ట్ టైమ్‌లో కూడా అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ షూటింగ్‌ని ఆర్గ‌నైజ్ చేస్తున్న మా నిర్మాత మహేష్‌కి కృత‌జ్ఞ‌త‌లు. నాకు బైక్ రైడింగ్ అంటే ఇష్టం కాని నేను ప్రొఫెష‌న‌ల్ రైడ‌ర్‌ని కాదు. ఈ లాక్డౌన్ టైమ్‌లో గురుప‌వ‌న్ నాకు ట్రైనింగ్ ఇచ్చారు. శ్రీ‌కాంత్, భూమిక లాంటి ఎక్స్‌పీరియ‌న్డ్స్ యాక్ట‌ర్స్‌తో న‌టించ‌డం ఒక వండ‌ర్‌ఫుల్ ఎక్స్‌పీరియ‌న్స్‌ అన్నారు.
 
హీరో శ్రీ‌కాంత్ మాట్లాడుతూ, నాకు బైక్ రెడింగ్ అంటే చాలా ఇష్టం. చిన్న‌ప్పుడు చాలా సార్లు రైటింగ్‌కి వెళ్లాను. అలాగే ఒక సారి హైద‌రాబాద్ నుండి ల‌డ‌క్ కార్‌లో వెళ్లాను. చాలా రోజుల త‌ర్వాత మ‌ళ్లీ మంచి టీమ్‌తో క‌లిసి ల‌డ‌క్ వెళ్ల‌డం ఒక మంచి ఎక్స్‌పీరియ‌న్స్. వైవిధ్యమైన కథతో స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీగా రూపొందుతోంది.

రామ్ ప్ర‌సాద్‌, జొవ‌హార్ రెడ్డి విజువ‌ల్స్ త‌ప్ప‌కుండా ఈ సినిమాకు ప్ల‌స్ అవుతాయి. సుమంత్ నాకు బ్ర‌ద‌ర్‌లాంటి వాడు. చ‌క్క‌గా న‌టించాడు. మంచి ఆర్టిస్టులు, టెక్నీషియ‌న్స్‌తో వ‌ర్క్ చేస్తున్నందుకు హ్యాపీగా ఉంది. ఈ సినిమా మంచి విజ‌యం సాధించాల‌ని మ‌న‌స్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు. 
 
ఈ కార్య‌క్ర‌మంలో సినిమాటోగ్రాఫ‌ర్ సి. రామ్ ప్ర‌సాద్‌, ఆర్ట్ డైరెక్ట‌ర్ జెకె మూర్తి, ఎడిట‌ర్ జునైద్ సిద్దికి, కొరియోగ్రాఫ‌ర్ ఆనీ మాస్ట‌ర్‌, సాత్విక్ మ‌రియు వికాస్ బైక్ రైడింగ్ టీమ్ స‌భ్యులు పాల్గొన్నారు. 
 
సుమంత్ అశ్విన్, శ్రీకాంత్, భూమిక‌, తాన్య హోప్, సప్తగిరి, పృథ్వి, సమీర్, రామ్ ప్ర‌సాద్‌, జోష్ ర‌వి, తివిక్రమ్ సాయి, శ్రీ‌కాంత్ అయ్యంగార్‌,  మ‌ధుమ‌ణి, సంధ్య జాన‌క్ త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి స్టోరీ, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం - గురు ప‌వ‌న్‌, ప్రొడ్యూస‌ర్ - జి. మ‌హేష్, డిఒపి - సి. రామ్ ప్ర‌సాద్‌, సంగీతం - సునీల్ క‌శ్య‌ప్‌, ఆర్ట్ డైరెక్ట‌ర్ - జెకె మూర్తి, ఎడిట‌ర్ - జునైద్ సిద్దికి, ఫైట్ మాస్ట‌ర్ - పృథ్విరాజ్‌, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ - చిరంజీవి ఎల్‌, ప్రొడ‌క్ష‌న్ ఎగ్జిక్యూటివ్ - భాను మంతిని, పిఆర్ఒ - వంశీ - శేఖ‌ర్‌.