సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. వీడ్కోలు 2024
Written By ఐవీఆర్
Last Updated : గురువారం, 19 డిశెంబరు 2024 (18:20 IST)

2024 మోస్ట్ పాపులర్ ఇండియన్ మూవీస్, వెబ్ సిరీస్‌లను ప్రకటించిన ఐఎండీబీ

Kalki
IMDB సినిమాలు, టీవీ షోలు, ప్రముఖులపై సమాచారం కోసం ప్రపంచంలోని అత్యంత ప్రాచుర్యం పొందిన, అధికారిక వనరు అయిన IMDB 2024లో ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన 10 భారతీయ సినిమాలు మరియు 10 వెబ్ సిరీస్‌లను ప్రకటించింది. IMDB వార్షిక జాబితాలు ప్రపంచవ్యాప్తంగా IMDBకి 250-మిలియన్లకు పైగా నెలవారీ విజిటర్స్ ఆధారంగా ఉంటాయి.
 
“IMDB మోస్ట్ పాపులర్ ఇండియన్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ ఆఫ్ 2024 జాబితాలు సంవత్సరపు టైటిల్స్ సెలబ్రేట్ చేయడమే కాకుండా, వీక్షకుల ప్రాధాన్యతలను కూడా తెలియజేస్తాయి. కంటెంట్ క్రియేటర్స్, అభిమానులకు వారి ఇష్టమైన వాటిని సెలెక్ట్ చేసుకోవడంలో ఒక మార్గనిర్దేశం చేస్తాయి" అని ఐఎండిబి ఇండియా హెడ్ యామిని పటోడియా అన్నారు. నెం.1 మూవీ కల్కి 2898-ఏడీ వంటి భారీ బడ్జెట్ చిత్రాల నుంచి నెం.10 మూవీ లాపటా లేడీస్ వంటి ఆకట్టుకునే డ్రామాల వరకు, ప్రియమైన ఫ్రాంచైజీల నుండి అద్భుతమైన ఒరిజినల్ సిరీస్ వరకు, ఈ జాబితా ఈ సంవత్సరంలో ప్రపంచ ప్రేక్షకులను ఆకర్షించిన భారతీయ కథలలోని విస్తృతిని ప్రదర్శిస్తాయి.
 
కల్కి 2898-ఏడీ 2024లో నెంబర్ వన్ ర్యాంక్ పొందిన మూవీ దర్శకుడు నాగ్ అశ్విన్ మాట్లాడుతూ "కల్కి 2898-ఏడీ 2024 మోస్ట్ పాపులర్ ఇండియన్ మూవీగా నిలవడం నిజంగా అద్భుతం. ఓపెన్ హార్ట్స్ తో సినిమాను ఆదరించిన  అద్భుతమైన ప్రేక్షకుల ప్రేమకు, మద్దతుకు ఈ గుర్తింపు నిదర్శనం. మా హృదయాన్ని ఈ సినిమాలో పోశామని, ప్రపంచవ్యాప్తంగా అన్ని వయసుల వారికీ ప్రతిధ్వనించే ఈ చిత్రం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ ప్రయాణాన్ని చిరస్మరణీయం చేసిన ఐఎండీబీకి, అభిమానులకు ధన్యవాదాలు. మీ ప్రోత్సాహం మమ్మల్ని మా కథలను మరింత లోతుగా ఆలోచించేలా ప్రేరేపిస్తుంది'' అన్నారు.
 
నెం.1 ర్యాంకింగ్ వెబ్ సిరీస్ హీరామండి: ది డైమండ్ బజార్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫాం అయిన నెట్ ఫ్లిక్ష్ ఇండియా సిరీస్ హెడ్ తాన్యా బామి మాట్లాడుతూ, "నెట్ ఫ్లిక్ష్ ఎల్లప్పుడూ ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన సిరీస్ లకు ప్రసిద్ది చెందింది. మా ఇండియన్ సిరీస్ ఆ గుర్తింపును పొందడం నిజంగా సంతోషాన్ని కలిగిస్తుంది. హీరమండి: డైమండ్ బజార్ అనే మా అత్యంత ప్రతిష్టాత్మక డ్రామా సిరీస్  ఒక సాంస్కృతిక చర్చగా మారింది. మామ్లా లీగల్ హై (6వ ర్యాంక్) కోర్టు రూమ్ డ్రామాను రిఫ్రెషింగ్ హ్యూమర్ తో నైపుణ్యంగా మిళితం చేసి, ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో (10వ ర్యాంక్) వీకెండ్ ఎంటర్ టైన్ మెంట్ ను నిర్వచించింది. IMDB టాప్ 10-మోస్ట్ పాపులర్ ఇండియన్ వెబ్ సిరీస్ ఆఫ్ 2024 జాబితాలో ఈ మూడు ప్రత్యేకమైన సిరీస్ లను చేర్చడం మన భారతీయ వైవిధ్యత మరియు నాణ్యతను ప్రదర్శిస్తుంది. మా కంటెంట్ వ్యూహంలో లాంగ్-ఫార్మాట్ స్టోరీ టెల్లింగ్ ప్రాముఖ్యతను బలపరుస్తుంది. 2025 కోసం మరింత కొత్త ఉత్సాహంతో ఎదురుచూస్తున్నామని, భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా మరెన్నో మరపురాని కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు.
 
ప్రైమ్ వీడియో, ఇండియా ఎస్వీఓడీ డైరెక్టర్ & హెడ్ షిలాంగి ముఖర్జీ మాట్లాడుతూ, "2024 మాకు అద్భుతమైన సంవత్సరం, ఎందుకంటే మేము కొత్త సిరీస్ లను ప్రారంభించడమే కాకుండా, మా సూపర్ సక్సెస్ ఫ్రాంచైజీల కొత్త సీజన్స్ తిరిగి తీసుకువచ్చాము. ఐఎండిబి  2024 మోస్ట్ పాపులర్ ఇండియన్ వెబ్ సిరీస్ లను, జాబితాలో మా మూడు సిరీస్ లు టాప్ 5లో ఉండటం ఆ ప్రేక్షకుల ప్రేమకు నిదర్శనం. మా రిటర్నింగ్ ఫేవరెట్లు మీర్జాపూర్ (నెం.2 ర్యాంక్) మరియు పంచాయత్ (నెం.3 ర్యాంక్), అలాగే సిటాడెల్: హనీ బన్నీ (ర్యాంక్ నెం.5) సిటాడెల్ ప్రపంచం నుండి పుట్టిన భారతీయ సిరీస్ కోసం ప్రపంచవ్యాప్తంగా కస్టమర్లు మరియు IMDB వినియోగదారుల నుండి మాకు లభించిన ప్రేమకు మేము రుణపడి ఉన్నాము. మేము 2025లో భారతదేశం మరియు ప్రపంచవ్యాప్తంగా మరిన్ని అద్భుతమైన సిరీస్ మరియు సినిమాల రాబోయే కంటెంట్ లైనప్ గురించి మేము చాలా ఉత్సాహంగా ఉన్నాము.
 
ఐఎండీబీ 2024 టాప్ 10 మోస్ట్ పాపులర్ ఇండియన్ మూవీస్
1. కల్కి 2898- AD
2. స్త్రీ 2: సర్కతే కా ఆటంక్
3. మహారాజా
4. షైతాన్
5. ఫైటర్
6. మంజుమెల్ బాయ్స్
7. భూల్ భులైయా 3
8. కిల్
9. సింగం ఎగైన్
10. లాపటా లేడీస్
 
2024 జనవరి 1 మరియు నవంబర్ 25, 2024 మధ్య భారతదేశంలో విడుదలైన అన్ని సినిమాలలో, సగటు 5 లేదా అంతకంటే ఎక్కువ ఐఎమ్డిబి యూజర్ రేటింగ్ కలిగి ఉండగా, ఈ 10 శీర్షికలు ప్రపంచవ్యాప్తంగా ఐఎండిబికి 250 మిలియన్లకు పైగా నెలవారీ సందర్శకుల పేజీ వీక్షణల ద్వారా నిర్ణయించబడినట్లుగా IMDB వినియోగదారులలో స్థిరంగా అత్యంత ప్రాచుర్యం పొందాయి.
 
2024 మోస్ట్ పాపులర్ ఇండియన్ వెబ్ సిరీస్ టాప్ 10
1. హీరమండి: డైమండ్ బజార్
2. మీర్జాపూర్
3. పంచాయత్
4. గ్యారాహ్ గ్యారాహ్
5. సిటాడెల్: హనీ బన్నీ
6. మామ్లా లీగల్ హై
7. తాజా ఖబర్
8. మర్డర్ ఇన్ మహిమ్
9. శేఖర్ హోమ్
10. ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో
 
జనవరి 1 మరియు నవంబర్ 25, 2024 మధ్య భారతదేశంలో విడుదలైన అన్ని వెబ్ సిరీస్లలో, సగటు 5 లేదా అంతకంటే ఎక్కువ IMDB యూజర్ రేటింగ్ కలిగి ఉన్నాయి, ఈ 10 టైటిల్స్ ప్రపంచవ్యాప్తంగా ఐఎండిబికి 250 మిలియన్లకు పైగా నెలవారీ సందర్శకుల పేజీ వీక్షణల ద్వారా నిర్ణయించబడ్డాయి.