గురువారం, 10 అక్టోబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 1 అక్టోబరు 2024 (22:47 IST)

టాప్ 250 భారతీయ చిత్రాల జాబితాను ప్రకటించిన ఐఎండీబీ

సినిమాలు, టీవీ షోలు, ప్రముఖుల సమాచారం కోసం ప్రపంచంలోని అత్యంత ప్రాచుర్యం పొందిన ఐఎండిబి అక్టోబర్ 2022లో ప్రారంభించిన ఇండియా ఇంస్టాగ్రామ్ హ్యాండిల్లో 2,50,000 మంది ఫాలోవర్లను చేరుకుంది. ఎవరు, ఏ చిత్రం ట్రెండింగ్ లో ఉందో తెలుసుకోవడానికి, కొత్త కంటెంట్ తెలుసుకోడానికి మరియు ఏమి మరియు ఎక్కడ చూడాలో నిర్ణయించడానికి దేశవ్యాప్తంగా ఎంటర్టైన్మెంట్ అభిమానులు ఐఎండిబి ఇండియా సోషల్ మీడియా హ్యాండిల్స్ పై ఆధారపడతారు. ఈ మైలురాయిని చేరుకున్న సందర్భంగా, IMDB ఆల్ టైమ్ టాప్ 250 హైయెస్ట్ రేటెడ్ ఇండియన్ మూవీస్ లిమిటెడ్ ఎడిషన్ కలెక్టబుల్ పోస్టర్ ను రూపొందించింది. దీనిని ఎంపిక చేసిన ఎంటర్ టైన్ మెంట్ ఇండస్ట్రీ లీడర్లకు బహుమతిగా అందించనున్నారు. దీనితో పాటు IMDB ఇండియా ఇంస్టాగ్రామ్ లో ఒక పోటీని నిర్వహిస్తుంది, దీనిలో సెలెక్ట్ అయిన అభిమానులకు ఈ ప్రతిష్టాత్మక పోస్టర్ ను గెలుచుకునే అవకాశాన్ని ఇస్తుంది. ఈ పోటీగురించి మరింత తెలుసుకోవడానికి IMDB ఇండియా ఇంస్టాగ్రామ్ కు వెళ్లండి.
 
IMDB టాప్ 250 హైయెస్ట్ రేటెడ్ ఇండియన్ మూవీస్ లిస్ట్ అనేది అత్యధిక రేటింగ్ పొందిన భారతీయ సినిమాల జాబితా, ఇది అభిమానులకు అద్భుతమైన కొత్త చిత్రాలను, అలాగే అన్ని దశాబ్దాలు, జానర్లు మరియు ప్రాంతాల క్లాసిక్ సినిమాల గురించి తెలుసుకోవడానికి వీలుకల్పిస్తుంది. ఈ డైనమిక్ జాబితాలోని వచ్చే చిత్రాలు క్రమం తప్పకుండా IMDBలో ఓటు వేసే IMDB వినియోగదారుల రేటింగ్ ల ద్వారా నిర్ణయించబడతాయి.
 
ఈ జాబితాలో ప్రస్తుతం నెం.1 చిత్రంగా 2023లో విమర్శకుల ప్రశంసలు అందుకున్న 12th ఫెయిల్  ఉండటం విశేషం. మహారాజా, కాంతారా, లాపటా లేడీస్ వంటి సమకాలీన విజయాలతో పాటు, భారతీయ సినిమా వైవిధ్యాన్ని ప్రదర్శించే జానే భీ దో యారో, పరియేరుమ్ పెరుమాళ్ మరియు పథేర్ పాంచాలి వంటి క్లాసిక్స్ కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఈ జాబితాలోని 250 సినిమాలకు ఐఎండీబీలో 8.5 మిలియన్లకు పైగా ఓట్లు వచ్చాయి.
 
సెప్టెంబర్ 22, 2024 నాటికి ఈ జాబితాలోని టాప్ 20 టైటిల్స్ ఇవే.
1. 12th ఫెయిల్
2. గోల్ మాల్
3. నాయకన్
4. మహారాజా
5. అపుర్ సంసార్
6. అన్బే శివం
7. పరియేరుమ్ పెరుమాళ్
8. 3 ఇడియట్స్
9. #హోం
10. మణిచిత్రతాఝు
11. బ్లాక్ ఫ్రైడే
12. కుంబలంగి నైట్స్
13. రాకెట్రీ: నంబి ఎఫెక్ట్
14. 777 చార్లీ
15. కిరీటం
16. C/O కంచరపాలెం
17. తారే జమీన్ పర్
18. సందేశం
19. దంగల్
20. లాపటా లేడీస్
 
మహారాజా, మైదాన్, ది గొట్ లైఫ్, లాపటా లేడీస్, మంజుమ్మెల్ బాయ్స్ సహా 2024లోని  ఐదు టైటిల్స్ ఈ జాబితాలో ఉండటం గమనార్హం. 1955లో విడుదలైన సత్యజిత్ రే క్లాసిక్ పథేర్ పాంచాలి ఈ జాబితాలో మొదటి చిత్రం.
 
ఏడు టైటిల్స్‌తో దర్శకుడు మణిరత్నం అగ్రస్థానంలో ఉండగా, అనురాగ్ కశ్యప్ ఆరు చిత్రాలతో రెండో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో దృశ్యం (మలయాళం), దృశ్యం-2 (మలయాళం), దృశ్యం(హిందీ), దృశ్యం-2 (హిందీ), మున్నా భాయ్ ఎంబీబీఎస్, లగే రహో మున్నా భాయ్, జిగర్తాండ, జిగర్తాండ డబుల్ ఎక్స్, కేజీఎఫ్: చాప్టర్ 1, కేజీఎఫ్: చాప్టర్ 2, బాహుబలి: ది బిగినింగ్, బాహుబలి 2: ది కన్ క్లూజన్  కూడా ఉన్నాయి.
 
ఈ జాబితాలో 12th ఫెయిల్ టాప్‌లో నిలవడంపై తన సంతోషాన్ని పంచుకున్న విక్రాంత్ మాస్సే ఈ చిత్రంలోని అత్యంత హృద్యమైన సన్నివేశాన్ని ఇలా గుర్తుచేసుకున్నారు. “నాకు ఇష్టమైన సన్నివేశం మనోజ్ మరియు అతని తల్లి మధ్య చాంపి సన్నివేశం, ఇది మనోజ్ తన అమ్మమ్మ చనిపోయిందని గ్రహించినప్పుడు సినిమాలో కీలకమైన ఘట్టం. ఒక్క షాట్ షూట్ చేయడానికి ఎంత ప్లానింగ్, ప్రొడక్షన్ ఉంటుందనేది దీని ప్రత్యేకత. ఈ సన్నివేశంలో బ్యాక్ గ్రౌండ్ లో, మ్యాజిక్ లైట్ తో ఒక తలుపు ఉంది-పగటిపూట రాత్రి కలిసే కాలం, ఇది కేవలం 5 నుండి 7 నిమిషాలు మాత్రమే ఉంటుంది. విధు వినోద్ చోప్రా సర్, డీఓపీ రంగరాజన్ రామభద్రన్ ఈ మాస్టర్ షాట్ ను నెలల ముందే డిజైన్ చేశారు. సెట్ లో నటీనటులకు మేము ఖచ్చితంగా చెప్పాల్సి వచ్చింది, ఎందుకంటే దానిని క్యాప్చర్ చేయడానికి మాకు కొన్నినిమిషాలు మాత్రమే ఉన్నాయి. భావోద్వేగభరితమైన ఈ సన్నివేశానికి గ్లిజరిన్ వాడకూడదని, ఆ క్షణానికి సాధ్యమైనంత సహజంగా వుండాలని గీతగారు, నేను నిర్ణయించుకున్నాం. ఏడవకుండా ఏడవాల్సిన సన్నివేశం అది. కాబట్టి ఇదొక ఒక పెద్ద సవాలు. దీనికి అనేక రిహార్సల్స్ అవసరమయ్యాయి. కానీ, మేము దానిని  విజయవంతంగా చిత్రంచగలిగాము”
 
టాప్ 250 హైయెస్ట్ రేటింగ్ ఇండియన్ మూవీస్ లిస్ట్ చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి. ఎంటర్ టైన్మెంట్ అభిమానులు భారతీయ సినిమాలు, టీవీ షోలు మరియు సెలబ్రిటీలపై అప్ డేట్ గా ఉండటానికి IMDb ఐఎండిబి ఇండియా ఇంస్టాగ్రామ్ హ్యాండిల్ ను అనుసరించండి.