ఏయ్ దూరంగా జరుగు... జాన్వీని టచ్ చేయబోయిన ఫ్యాన్...

శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ ఇప్పుడు ఎక్కడికెళ్లినా అభిమానులు ఆమెను చుట్టిముట్టేస్తున్నారు. ఇటీవల ఆమె ఓ ఫంక్షనుకి వెళ్లి వస్తుంటే ఓ అభిమాని సెల్ ఫోన్ తీసుకుని సెల్ఫీ కోసం ఎగబడ్డాడు. జాన్వీ దూరంగా జరుగుతున్నా అతడు ఆమెకు దగ్గరగా రావడం మొదలుట్టా

Jhanvi Kapoor
srinivas| Last Modified గురువారం, 26 జులై 2018 (17:38 IST)
శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ ఇప్పుడు ఎక్కడికెళ్లినా అభిమానులు ఆమెను చుట్టిముట్టేస్తున్నారు. ఇటీవల ఆమె ఓ ఫంక్షనుకి వెళ్లి వస్తుంటే ఓ అభిమాని సెల్ ఫోన్ తీసుకుని సెల్ఫీ కోసం ఎగబడ్డాడు. జాన్వీ దూరంగా జరుగుతున్నా అతడు ఆమెకు దగ్గరగా రావడం మొదలుట్టాడు. దీనితో జాన్వీ సెక్యూరిటీ... ఏయ్ దూరంగా జరుగు అంటూ నెట్టివేసారు.
 
ఇకపోతే అతిలోక సుంద‌రి శ్రీదేవి కుమార్తె జాన్వీ థ‌డ‌క్ అనే సినిమా ద్వారా బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఈ సినిమాతో తొలి సినిమాతోనే న‌టిగా మంచి మార్కులు సంపాదించుకుంది. దీంతో జాన్వీతో సినిమాలు తీసేందుకు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు క్యూ క‌డుతున్నారు. అయితే.. టాలీవుడ్ నుంచి కూడా ఆ ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయని వార్త‌లు వ‌స్తున్నాయి. ఇంత‌కీ టాలీవుడ్ నుంచి ఎవ‌రు ప్ర‌య‌త్నిస్తున్నారంటే.. దిల్ రాజు పేరు వినిపిస్తోంది. 
 
దిల్ రాజు నిర్మించే భారీ చిత్రంలో జాన్వీ హీరోయిన్ అయితే బాగుంటుంద‌నే ఉద్దేశ్యంతో ఇటీవ‌ల కాంటాక్ట్ చేసార‌ని టాక్ వినిపిస్తోంది. దీంతో పాటు ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి త‌ను చేయ‌బోయే భారీ మ‌ల్టీస్టార‌ర్లో జాన్వీ అయితే బాగుంటుంద‌ని ఇటీవ‌ల క‌ర‌ణ్ జోహ‌ర్‌ని కాంటాక్ట్ చేసార‌ని మ‌రో వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. అయితే... రాజ‌మౌళి సినిమాలో న‌టిస్తే.. దేశ‌వ్యాప్తంగా మంచి క్రేజ్ వ‌స్తుంద‌ని ఆలోచ‌న‌తో జాన్వీ ఫాద‌ర్ బోనీ క‌పూర్ ఓకే చెప్పార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి... ప్ర‌చారంలో ఉన్న వార్త‌లపై జాన్వీ కానీ... బోనీ క‌పూర్ కానీ స్పందిస్తారేమో చూడాలి.దీనిపై మరింత చదవండి :