డేటింగ్... పెళ్లి అంటూ గొడవ... వీళ్లకు బుద్ధి రాదంతే అంటున్న గాయని సునీత

ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావో.. ఊర్మిళ, జె.డి.చక్రవర్తి కాంబినేషన్లో వచ్చిన ఈ పాట లక్షలాదిమంది ప్రజలను ఎంతగానో అలరించింది. పాట పాడిన గాయని సునీతకు కూడా అదే స్థాయిలో మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ పాట తరువాత సునీత ఎన్నో పాటలను పాడారు. ఎన్ని పాటలు పాడినా

Sunitha
TJ| Last Modified శనివారం, 21 జులై 2018 (16:34 IST)
ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావో.. ఊర్మిళ, జె.డి.చక్రవర్తి కాంబినేషన్లో వచ్చిన ఈ పాట లక్షలాదిమంది ప్రజలను ఎంతగానో అలరించింది. పాట పాడిన గాయని సునీతకు కూడా అదే స్థాయిలో మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ పాట తరువాత సునీత ఎన్నో పాటలను పాడారు. ఎన్ని పాటలు పాడినా ఆ పాటను ఇప్పటికీ మర్చిపోలేరు.
 
ఆమె తన 18వ యేటే కిరణ్‌ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. ఆమెకు ఇద్దరు పిల్లలు. అయితే భార్యాభర్తలిద్దరూ కొన్ని అనివార్య కారణాలతో విడిపోయారు. కానీ ఆ తరువాత సునీత వివాహం చేసుకోలేదు. గత వారంరోజుల నుంచి సునీత రెండో పెళ్ళి చేసుకుంటోందని, హైదరాబాద్‌కు చెందిన ఐటీ ఎంట్రప్రెన్యూర్ తో వివాహం చేసుకోబోతోందని అనేక పుకార్లు షికారు చేశాయి.
 
సామాజిక మాథ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై సునీత తీవ్రంగా స్పందించారు. నేను ఎన్నిసార్లు చెప్పినా వీళ్లకు బుద్ధి రాదు. అసు నా వ్యక్తిగత విషయాలు ఎందుకు? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో కూడా కొందరు ఇలాంటి ప్రచారాలే చేస్తే లీగల్ నోటీసులు ఇచ్చి రాసినవారిపై చర్యలకు పూనుకుంది. కాబట్టి గాలివార్తలు రాసేవారూ బహుపరాక్... దీనిపై మరింత చదవండి :