ఈ 'త‌రుణ్ భాస్క‌ర్'కు ఏమైంది?

పెళ్లి చూపులు సినిమాతో చిన్న సినిమాల్లో పెద్ద విజ‌యం సాధించి సంచ‌ల‌నం సృష్టించిన యువ ద‌ర్శ‌కుడు త‌రుణ్ భాస్క‌ర్. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవ‌ర్సీస్‌లో సైతం సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. తాజాగా ఈ న‌గ‌రానికి ఏమైంది అనే సినిమా తీసాడు. వైవిధ

Tharun Bhaskar
srinivas| Last Modified బుధవారం, 4 జులై 2018 (12:38 IST)
పెళ్లి చూపులు సినిమాతో చిన్న సినిమాల్లో పెద్ద విజ‌యం సాధించి సంచ‌ల‌నం సృష్టించిన యువ ద‌ర్శ‌కుడు త‌రుణ్ భాస్క‌ర్. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవ‌ర్సీస్‌లో సైతం సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. తాజాగా ఈ న‌గ‌రానికి ఏమైంది అనే సినిమా తీసాడు. వైవిధ్య‌మైన క‌థాంశంతో రూపొందిన ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ను ఆశించిన స్థాయిలో ఆక‌ట్టుకోలేక‌పోయింది. రివ్యూలలో ఈ సినిమాలోని ప్ల‌స్ & మైన‌స్ ఏంటో చెబుతూ రివ్యూ రాసారు. ఇది త‌రుణ్ భాస్క‌ర్‌కి బాగా కోపం తెప్పించింది.
 
దీంతో రివ్యూ రాసే వారికి సినిమాలోని స్ర్కీన్‌ప్లే గురించి... ఏం తెలుస్తుంది. వాళ్లు సినిమాకి సంబంధించి కోర్స్ చేస్తే బాగుంటుంది అంటూ రివ్యూ రాసే వారిపై త‌న‌దైన శైలిలో ఫైర్ అయ్యాడు. పెళ్లి చూపులు సినిమా బాగుంది. కొత్త త‌ర‌హా సినిమా అంటూ అభినందిస్తూ రివ్యూ రాసిన‌ప్పుడు వాళ్ల‌కు సినిమా స్ర్కీన్‌ప్లే గురించి ఏం తెలుసు..? కోర్స్ చేసి రావాలి అనిపించ‌లేదా..? అంటూ రివ్యూ రైట‌ర్స్ త‌రుణ్ భాస్క‌ర్ పైన ఫైర్ అవుతున్నారు.
 
త‌న పైన వ‌స్తోన్న విమ‌ర్శ‌లపై త‌రుణ్ భాస్క‌ర్ క్లారిటీ ఇచ్చాడు. రివ్యూ రైట‌ర్స్ అంటే త‌న‌కు గౌర‌వ‌మ‌ని.. త‌ను చేసిన వ్యాఖ్య‌లు కేవ‌లం ఒక రివ్యూను చూసి అలా స్పందించాన‌ని అన్నాడు. ఇక నుంచి సోష‌ల్ మీడియాలో ఉండ‌కూడ‌ద‌ని నిర్ణ‌యించుకున్నాను అని కూడా చెప్పాడు. ఇదంతా చూస్తున్నవారు తరుణ్ భాస్కర్‌కు ఏమైంది...? అంటూ సెటైర్లు వేస్తున్నారు.దీనిపై మరింత చదవండి :