ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 11 జూన్ 2024 (11:46 IST)

కల్కి 2898 AD’ ట్రైలర్ ఫెంటాస్టిక్ - దేశం గర్వించేలా ఉంటుంది: నాగ్ అశ్విన్

Kalki 2898- Prabhas
Kalki 2898- Prabhas
మోస్ట్ ఎవైటెడ్ అప్ కమింగ్ సైన్స్ ఫిక్షన్ ఎపిక్ ‘కల్కి 2898 AD’, మ్యాసీవ్ అంచనాలతో ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ట్రైలర్ ఫైనల్లీ రిలీజ్ అయ్యింది. 'కల్కి 2898 AD' సినిమాటిక్ యూనివర్స్ ని ఎక్స్ ట్రార్డినరీగా పరిచయం చేస్తూ రెండు నిమిషాల యాభై ఒక్క సెకన్ల నిడివి గల ట్రైలర్ ప్రేక్షకులను ఇండియన్ మైథాలజీ వరల్డ్ లోకి తీసుకెళ్ళింది. టాప్ క్లాస్  సైన్స్ ఫిక్షన్, VFXతో అత్యద్భుతం అనిపించింది. సినిమా ట్రైలర్ తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, ఇంగ్లిష్ తో సహా పలు భాషల్లో చూడటానికి అందుబాటులో ఉంది.
 
Kalki 2898- Prabhas
Kalki 2898- Prabhas
ఎలక్ట్రిఫైయింగ్ ట్రైలర్‌లో, మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తన యాక్షన్ పవర్ ని ప్రజెంట్ చేసి, అశ్వత్థామ పాత్రకు ప్రాణం పోశారు. ఉలగనాయగన్ కమల్ హాసన్ తన అద్భుతమైన పాత్రలో నిజంగా గుర్తుపట్టలేనంతగా కనిపిస్తున్నారు. ఎక్సయిట్మెంట్ ని మరింతగా పెంచుతూ ఫ్యూచర్ వెహికల్, బెస్ట్ ఫ్రెండ్ 'బుజ్జి'తో ప్రభాస్ తన పవర్-ప్యాక్డ్ యాక్షన్, కెమిస్ట్రీతో అదరగొట్టారు. దీపికా పదుకొనే ప్రతి ఫ్రేమ్‌లో ఎమోషన్స్ తో నెరేటివ్ కి డెత్ ని జోడిస్తుంది. దిశా పటాని తన అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలతో ఆకట్టుకుంది. ట్రెయిలర్ హోరిజోన్‌లో 'నయా యుగ్' (కొత్త యుగం) రాబోయే బాటిల్ గురించి రిఫరెన్స్ లతో నిండి ఉంది.
 
పవర్-ప్యాక్డ్ డైలాగ్‌లు, అద్భుతమైన బీజీఎం, టాప్ క్లాస్  VFXతో, 'కల్కి 2898 AD' ట్రైలర్ ప్రేక్షకులు ఆడ్రినలిన్-ఫ్లూయిడ్ తో కూడిన సినిమాటిక్ జర్నీని హామీ ఇస్తుంది. ప్రతి అంశంలోనూ అద్భుతం అనిపిస్తూ, బెస్ట్ ఇంటర్ నేషనల్ సినిమా ఎక్స్ పీరియన్స్ ని అందిస్తూ, మేకర్స్ ఎక్స్ ట్రార్డినరీ ట్రైలర్‌ను అందించారు. ట్రూ పాన్-ఇండియన్ మూవీ ‘కల్కి 2898 AD’ భారతదేశంలోని అత్యుత్తమ ప్రతిభావంతులను ఒకచోట చేర్చింది. బిగ్గెస్ట్ స్టార్ కాస్ట్, టెక్నికల్, మ్యూజిక్, విజువల్స్ మైండ్స్ పని చేస్తున్న కల్కి వివిధ పరిశ్రమల నుండి దేశంలోని అత్యుత్తమ వ్యక్తులకు రిప్రజెంట్ చేస్తోంది.
 
ట్రైలర్ రిలీజ్ సందర్భంగా దర్శకుడు నాగ్ అశ్విన్ మాట్లాడుతూ “ఈ రోజు నా మనసు చాలా ఎమోషన్స్ తో నిండి ఉంది. ఒక ఫిల్మ్ మేకర్స్ గా ఇండియన్ మైథాలజీ, సైన్స్ ఫిక్షన్ పట్ల నాకు చాలా పాషన్. 'కల్కి 2898 AD'లో ఈ రెండు ఎలిమెంట్స్ ని మెర్జ్  చేయడం మా ఆర్టిస్ట్ లు. టీం అద్భుతమైన ప్రతిభ, అంకితభావం వల్ల సాధ్యమైంది. ఈ కలని సాకారం చేసుకోవడానికి మాకు చాలా సమయం పట్టింది. మా నిర్మాతలు, స్టార్ కాస్ట్ నుంచి అద్భుతమైన కక్రియేటివ్ మైండ్స్, 'కల్కి 2898 AD' మొత్తం సిబ్బంది,  ప్రతి వ్యక్తి ఈ చిత్రానికి ప్రాణం పెట్టి పని చేశారు. ఈ ట్రైలర్ తెలుగు ప్రేక్షకులను, యావత్ దేశాన్ని గర్వించేలా చేస్తుందని, సినిమా కోసం వారిని ఎక్సయిట్ చేసేలా ఉంటుందని మేము ఆశిస్తున్నాము' అన్నారు.
 
'కల్కి 2898 AD' లో ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొణె, దిశా పటానీ సహా ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు. విజనరీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. మల్టీలింగ్వెల్, మైథాలజీ -ఇన్స్ స్పైర్డ్  సైన్స్ ఫిక్షన్ విజువల్ వండర్ ఫ్యూచర్ లో సెట్ చేయబడింది. ఈ చిత్రం 2024 జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది.