బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : బుధవారం, 18 అక్టోబరు 2017 (12:02 IST)

నేనే 'భారతీయుడు'ని... వచ్చే యేడాది నుంచి షూటింగ్: విశ్వనటుడు

"భారతీయుడు" స్వీక్వెల్ నుంచి తప్పుకున్నట్టు వచ్చిన వార్తలపై విశ్వనటుడు కమల్ హాసన్ స్పందించారు. ఈ ప్రాజెక్టు నుంచి తాను తప్పుకోలేదని, ఈ చిత్రం షూటింగ్ వచ్చే యేడాది నుంచి మొదలవుతుందని ప్రటిచారు.

"భారతీయుడు" స్వీక్వెల్ నుంచి తప్పుకున్నట్టు వచ్చిన వార్తలపై విశ్వనటుడు కమల్ హాసన్ స్పందించారు. ఈ ప్రాజెక్టు నుంచి తాను తప్పుకోలేదని, ఈ చిత్రం షూటింగ్ వచ్చే యేడాది నుంచి మొదలవుతుందని ప్రటిచారు. ప్రస్తుతం దక్షిణాదిలో 'బాహుబ‌లి -2' త‌ర్వాత మోస్ట్ అవైటెడ్ మూవీ ఏదైనా ఉంది అంటే అది "రోబో 2" (2.ఓ) మాత్ర‌మే. ఇటీవ‌ల ప్రారంభ‌మైన మెగాస్టార్ "సైరా న‌ర‌సింహారెడ్డి'' చిత్రం జాతీయ స్థాయి స్కేల్‌లో ఉంటుంద‌ని ప్ర‌క‌టించారు కాబ‌ట్టి.. కాస్తంత అంచ‌నాలేర్ప‌డ్డాయి. ఇక ఈ రెండిటి త‌ర్వాత మ‌ళ్లీ సౌత్ మొత్తం ఎదురు చూసే మోస్ట్ అవైటెడ్ మూవీ ఏది? అంటే మ‌ళ్లీ 'బాహుబ‌లి' డైరెక్ట‌ర్ ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ప్రారంభించే సినిమానే అవుతుంది.
 
అయితే, ఎస్.శంక‌ర్ 'రోబో2' చిత్రీక‌ర‌ణ పూర్తి చేయ‌గానే ప్రారంభించే ప్రాజెక్ట్ మ‌ళ్లీ సెన్సేష‌న్ అవుతుంది. శంక‌ర్ ఓ సినిమా ప్రారంభిస్తున్నాడు అంటే ఇటు సౌత్‌తో పాటు అటు నార్త్‌లోనూ విస్తృతంగా చర్చ సాగుతుంది. అంత‌టి ఇమేజ్ ఉన్న ద‌ర్శ‌కుడు ఈసారి విశ్వ‌న‌టుడు క‌మ‌ల్‌హాసన్‌తో 'భార‌తీయుడు' సీక్వెల్ తెర‌కెక్కించే ప్లాన్‌లో ఉన్నార‌ు. ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాత. 
 
తెలుగు, త‌మిళ్ (ఇండియ‌న్ 2), హిందీలో ఈ సినిమా తెర‌కెక్క‌నుంది. సుమారు రూ.200 కోట్ల బ‌డ్జెట్ ఖ‌ర్చు చేయనున్నార‌ని ప్ర‌చార‌మైంది. అయితే తాజాగా ఈ ప్రాజెక్ట్ నుండి కమలహాసన్ తప్పుకున్నార‌నే వార్త సోషల్ మీడియాలో వచ్చింది. దీంతో కమల్ హాసన్ ఓ క్లారిటీ ఇచ్చారు. భారతీయుడు సీక్వెల్ నుండి త‌ప్పుకోలేదు. ఆ సినిమాలో న‌టించేందుకు రెడీగా ఉన్నాన‌ని క‌మ‌ల్ తెలిపారు. రోబో2 వచ్చే ఏడాది రిప‌బ్లిక్ డే కానుక‌గా రిలీజ‌వుతుంది. త‌దుప‌రి క‌మ‌ల్‌తో "భార‌తీయుడు-2" ప్రారంభమవుతుందని చిత్రపరిశ్రమ వర్గాల సమచారం.