శుక్రవారం, 20 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 21 ఫిబ్రవరి 2024 (18:24 IST)

కమల్ హాసన్ ఇండియన్ 2 చిత్ర నైజాం హక్కులు పొందిన ఏషియన్, సురేష్ ప్రొడక్షన్

Indian 2
Indian 2
ఉలగనాయగన్ కమల్ హాసన్ నటించిన తమిళ చిత్రం ఇండియన్ 2 . ప్రియా భవానీ శంకర్, కాజల్ అగర్వాల్, సిద్దార్త్, రకుల్ ప్రీత్ సింగ్, ఢిల్లీ గణేష్, బాబీ సింహ తదితరులు నటించిన ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తయింది. కాగా, ఈ చిత్రం తెలుగులో నైజాం హక్కులను ఏషియన్ ఫిలిమ్స్, సురేష్ ప్రొడక్షన్ ఎల్.ఎల్.పి. పొందారు.
 
ఇండియన్ సినిమాకు సీక్వెల్ ఈ సినిమా. తెలుగులో భారతీయుడు గా పేరు పెట్టారు. దర్శకుడు శంకర్ రూపొందించిన ఈ సినిమా సమకాలీన రాజకీయాలకు అద్దం పట్టే విధంగా వుంటుందని నిర్మాతలు తెలియజేస్తున్నారు. షూటింగ్ లో ఆలస్యం జరిగిన ఎట్టకేలకు పూర్తయి థియేటర్లలో రావడం ఆనందంగా వుందని పేర్కొన్నారు. త్వరలో విడుదల తేదీని వెల్లడించానున్నారు.