సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 24 ఆగస్టు 2018 (13:05 IST)

ఘాటు ఫోటోలతో ఫిల్మ్ మేకర్స్‌ను బుట్టలోపడేస్తున్న 'కంచె' భామ

క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన చిత్రం "కంచె". ఈ చిత్రంలో హీరోయిన్‌గా ముంబై భామ ప్రగ్యా జైశ్వాల్ నటించింది. ఈ చిత్రంలో ఆమె నటనకుగాను మంచి గుర్తింపు వచ్చింది.

క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన చిత్రం "కంచె". ఈ చిత్రంలో హీరోయిన్‌గా ముంబై భామ ప్రగ్యా జైశ్వాల్ నటించింది. ఈ చిత్రంలో ఆమె నటనకుగాను మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత కొన్ని సినిమాలలో కనిపించినా అవేవీ బ్రేక్ ఇవ్వలేదు. అలా అని ప్రగ్యా నిరాశలో కూరుకుపోలేదు. తన ప్రయత్నాలు కంటిన్యూ చేస్తూనే ఉంది.
 
అదేసమయంలో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఇతర బ్యూటీల మాదిరిగానే అప్డేటెడ్‌గా ఉంటోంది. తన ఫోటోలను అపుడపుడూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఘాటు ఫోటోలు చూపెడుతూ నిర్మాతలకు నేనున్నాంటూ సందేశాలు పంపుతోంది. 
 
తాజాగా ఒక బ్లాక్ డ్రెస్‌లో ఉన్న ఫోటోను పోస్ట్ చేసి 'పిజ్జా??' అనే క్యాప్షన్ పెట్టింది. అంటే ఆమె పిజ్జా తినడానికి రెఢీ అవుతోందో లేదా 'నేను పిజ్జా లాగా ఉన్నాను కదా?' అని అడుగుతోందో మాత్రం అర్థం కావడం లేదు. ఒకవేళ రెండోదే కనుక ఆమె ప్రశ్న అయితే మాత్రం పిజ్జాలా ఏం ఖర్మ.. రవివర్మ కుంచె నుండి జాలువారిన అతిలోక సుందరిలా ఉంది 'కంచె' బ్యూటీ.