Daily Horoscope
✕

థియేటర్స్‌లోనే ‘ఖిలాడి’ విడుద‌ల చేస్తాం

Updated: సోమవారం, 17 మే 2021 (12:04 IST)
Khiladi (file)
రవితేజ, దర్శకుడు రమేష్‌ వర్మ కాంబినేషన్‌లో రూపొందుతున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఖిలాడి’. ‘ప్లే స్మార్ట్‌’ అనేది ఉపశీర్షిక. మీనాక్షీ చౌదరి, డింపుల్‌ హయతి హీరోయిన్లు. ఇటీవల విడుదలైన ‘ఖిలాడి’ టీజర్‌కు అద్భుతమైన స్పందన లభిస్తోంది. దీంతో ‘ఖిలాడి’ సినిమాపై ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీలో కూడా అంచనాలు పెరిగిపోయాయి. రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్న ‘ఖిలాడి’ సినిమా హవిష్‌ ప్రొడక్షన్స్, పెన్‌ స్టూడియోస్, ఏ స్టూడియోస్‌ పతాకాలపై కోనేరు సత్యానారాయణ నిర్మిస్తున్నారు.
 
సోషల్‌ మీడియాలో ‘ఖిలాడి’ సినిమా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో విడుదల కానుందనే ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని, ‘ఖిలాడి’ చిత్రాన్ని థియేటర్స్‌లోనే విడుదల చేస్తామని ‘ఖిలాడి’ చిత్ర యూనిట్ స్పష్టం చేసింది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత కోనేరు సత్య నారాయణ మాట్లాడుతూ, ‘‘ఖిలాడి’ సినిమా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో విడుదల కానుందనే ప్రచారం పూర్తిగా అవాస్తవం. థియేటర్స్‌లో చూసి ప్రేక్షకులు ఆస్వాదించేలా ‘ఖిలాడి’ సినిమాను చిత్రీకరిస్తున్నాము. నిర్మాణ విలువల విషయంలో కూడా ఎక్కడ రాజీ పడలేదు. ‘ఖిలాడి’ సినిమా కథ, కథనం, సాంకేతిక విలువలు అన్నీ అత్యద్భుతంగా ఉంటాయి. థియేటర్స్‌ ఎక్స్‌పీరియన్స్‌ కోసమే ‘ఖిలాడి’ చిత్రాన్ని తీస్తున్నాము. ఈ సినిమాను థియేటర్స్‌లోనే విడుదల చేస్తాం.
 
ప్రేక్షకులు ఆశ్చర్యపోయేలా దర్శకుడు రమేష్‌ వర్మ ‘ఖిలాడి’ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. యాక్షన్, రొమాన్స్, కథ, కథనం ఇలా అన్ని అంశాలు ప్రేక్షకులను మెప్పించేలా ఉంటాయి. అలాగే ఇటీవల ఇటీలీలో తీసిన యాక్షన్‌ సీక్వెన్సెస్‌ మరో హైలైట్‌. ఇక దేవి శ్రీ ప్రసాద్‌ అందించిన సంగీతం, స్టంట్‌ కొరియోగ్రాఫర్స్‌ డిజైన్‌ చేసిన యాక్షన్‌ సీన్స్‌ సినిమాకు అదనపు ఆకర్షణలు. సాంగ్స్‌ విడుదలను గురించి త్వరలో వివరాలు వెల్లడించబోతున్నాం. కరోనా పరిస్థితులు సద్దుమణిగిన తర్వాత కొత్త విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అని అన్నారు.
 
సుజిత్‌ వాసుదేవ్, జీకే విష్ణు ఈ సినిమాకు ఛాయగ్రాహకులు. సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్‌ తమ్ముడు సాగర్, శ్రీకాంత్‌ విస్సా ఈ సినిమాకు డైలాగ్స్‌ అందిస్తున్నారు. శ్రీమణి లిరిక్స్‌ రాస్తుండగా, అమర్‌ రెడ్డి ఎడింటింగ్‌ బాధ్యతలను నిర్వహిస్తున్నారు.

అన్నీ చూడండి

ప్రయాణికుల భద్రతే ముఖ్యం.. రాత్రి పూట మొబల్ ఫోన్ల చార్జింగ్ బంద్

Weather forecast: అక్టోబర్ 29, 2026 నాటి తెలంగాణ- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వాతావరణం ఎలా వుందంటే?

మలయాళ నటుడు నివిన్ పౌలీపై క్రిమినల్ కేసు - కేరళ హైకోర్టు కొట్టివేత

తలుపు తీసే వుంచా, మా ఆయన గుర్రుపెట్టి నిద్రపోతున్నాడు, చంపేయ్: జిమ్ ట్రైనర్‌తో భార్య

వైఎస్ షర్మిలకు వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి రాసిన లేఖలో ఏముంది?

అన్నీ చూడండి

గ్యాస్ట్రిక్ సమస్యను అధికమించేందుకు చిట్కాలు

హెచ్‌సీజీ విశాఖ, ఎన్‌ఎస్‌ఆర్‌ఐటీ విద్యార్థుల వినూత్న కార్యక్రమం: ఫ్లాష్‌మాబ్‌తో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన

మీకు పదేపదే దద్దుర్లు వస్తున్నాయా, వాటిని అలర్జీ అనుకుంటున్నారా, కాకపోవచ్చు...

ఎస్ఆర్ఎం వైద్య కాలేజీ ఆస్పత్రిలో 'ఏజ్ వెల్ ఇండియా'

కిడ్నీల పనితీరును మెరుగుపరిచే 5 సహజసిద్ధమైన పానీయాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments