గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : శనివారం, 20 మార్చి 2021 (23:40 IST)

ఫారియా అబ్దుల్లా పెద్ద ఛాన్స్ కొట్టేసింది!

Faria Abdullah
జాతి ర‌త్నాలు సినిమాకే స‌క్సెస్ నాయిక‌గా పేరు తెచ్చుకున్న ఫారియా అబ్దుల్లా రెండో సినిమాకు పెద్ద అవ‌కాశం వ‌చ్చేసింది. సినిమారంగంలో స‌క్సెస్ హీరోయిన్ వుంటే చాలు హీరోలు వెంట‌ప‌డుతుంటారు. అయితే ఫారియాను చూసి ప్ర‌భాస్‌, ఏమిటి ఇంత హైట్‌, అన్న కామెంట్ చేశాడుకూడా. అప్ప‌టికే ఆయ‌న సినిమాల‌లో హీరోయిన్లు బుక్ అయిపోయారు. అదేవిధంగా విజ‌య్‌దేవ‌ర‌కొండ‌తో కూడా చేయ‌డానికి ఛాన్స్ వ‌స్తుందేమోన‌ని ఫారియా చూసిన‌ట్లు తెలుస్తోంది. న‌వీన్ పోలిశెట్టి త‌ర్వాత సినిమా పెద్ద హీరోతో చేస్తుంద‌ని స‌క్సెస్‌మీట్‌లో సూచాయిగా చెప్పాడు. వెంట‌నే జాతిర‌త్నాలు సీక్వెల్ వుంద‌ని చిత్ర  నిర్మాత‌లు ప్ర‌క‌టించ‌డంతో మ‌ర‌లా న‌వీన్‌తోనే వుంటుందని అనుకున్నారు.

తాజా స‌మాచారం ప్ర‌కారం రవితేజతో రొమాన్స్ చేయబోతోంది ఫారియా అబ్దుల్లా. ఇందుకు సంబంధించిన చ‌ర్చ‌లు పూర్త‌య్యాయి. ప్ర‌స్తుతం ఖిలాడి సినిమా చేస్తున్నాడు. ర‌వితేజ‌. ఆ సినిమా అనంత‌రం త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఇందుకు సంబంధించిన వార్త కూడా బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ సినిమాలో ఫ‌రియా వుంటుంద‌ని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇప్ప‌టికే క‌న్న‌డ న‌టి శ్రీ‌లీల‌ను ఎంపిక చేసిన‌ట్లు స‌మాచారం. మ‌రో న‌టి ఫారియా. ఇద్ద‌రూ ర‌వితేజ స‌ర‌స‌న కొత్త‌వారే. మ‌రి వారే సినిమాకే ఆక‌ర్ష‌ణ‌గా వుంటారేమో చూడాలి.