బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 20 మార్చి 2021 (23:02 IST)

ఇన్​స్టాగ్రామ్‌ కొత్త ఫీచర్.. అంతా టీనేజర్ల కోసమే..

సోషల్ మీడియా ప్లాట్​ఫామ్​లో టీనేజర్లకు సురక్షితమైన వాతావరణం అందించేందుకు ఇన్​స్టాగ్రామ్​ తాజాగా మరో కొత్త ఫీచర్​ను చేర్చింది. 18 ఏళ్లలోపు టీనేజర్లకు అడల్ట్స్​ సందేశాలను పంపకుండా నిరోధించే ఫీచర్​ను తీసుకొచ్చింది. దీంతో, ఇకపై ఎవరైనా తమను ఫాలో చేయని టీనేజర్స్​కు అడల్డ్స్​ మెసేజ్​ చేసే అవకాశం ఉండదు. దీనికి సంబంధించిన భద్రతా ఫీచర్​ను చేర్చింది. 
 
మెషిన్​ లెర్నింగ్​ టెక్నాలజీ సహాయంతో ఈ ఫీచర్​ రూపొందించింది ఇన్​స్టాగ్రామ్​. అయితే, సాధారణంగా సోషల్​ మీడియా ప్లాట్​ఫామ్ లో సైన్​అప్​​ చేసేటప్పుడు వారి వయస్సు వివరాలు కోరుతుందన్న విషయం తెలిసిందే. అయితే, కొంత మంది టీనేజర్స్​ ఎక్కువ వయసును నమోదు చేసి అకౌంట్​ క్రియేట్​ చేస్తున్నారు.
 
దీంతో, ఇలాంటి ఫేక్​ అకౌంట్లను నిరోధించేందుకు, వారి అసలు వయస్సును నిర్థారించేందుకు ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్​, మెషిన్​ లెర్నింగ్​ టెక్నాలజీని ఉపయోగిస్తున్నామని ఇన్​స్టాగ్రామ్​ ఓ ప్రకటనలో తెలిపింది. కాగా, ప్రపంచవ్యాప్తంగా ఇన్‌స్టాగ్రామ్‌కు ప్రస్తుతం 1 బిలియన్​కు పైగా నెలవారీ యాక్టివ్​ వినియోగదారులు ఉన్నారు.
 
2017లో ఫేస్​బుక్​ యాజమాన్యంలోని మెసెంజర్​ కూడా 6 నుండి -12 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లల కోసం మెసెంజర్ కిడ్స్​ అనే చాట్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. పిల్లల కోసమే ప్రత్యేకంగా రూపొందించిన 'మెసెంజర్ కిడ్స్' ప్లాట్​ఫార్మ్​కు వారి నుంచి అనూహ్య స్పందన వచ్చింది. దీంతో ఇప్పుడు ఫేస్​బుక్​ చూపు తన దృష్టి ఇన్​స్టాగ్రామ్​ యాప్​పై పెట్టిన సంగతి తెలిసిందే.