గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : శనివారం, 13 మార్చి 2021 (17:57 IST)

సింహం పిల్లతో వెడ్డింగ్‌ ఫొటోలు.. మత్తు మందు ఇచ్చి..?

Lion Cub
పాకిస్థాన్‌లోని లాహోర్‌కు చెందిన ఒక జంట సింహం పిల్లతో వెడ్డింగ్‌ ఫొటోలు తీయించుకుంది. దానికి మత్తు ఇచ్చి తీసిన వెడ్డింగ్‌ ఫొటోలు, సంబంధిత వీడియోను స్టూడియో అఫ్జల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. దీంతో అవి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. కాగా, జంతు ప్రేమికులు దీనిపై మండిపడ్డారు. వెడ్డింగ్‌ ఫొటో షూట్‌ కోసం సింహం పిల్లకు మత్తు ఇచ్చి దానిని హింసించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
పాకిస్థాన్‌కు చెందిన 'సేవ్‌ ద వైల్డ్‌' అనే ఎన్జీవో సంస్థ దీనిపై పంజాబ్‌ వన్యప్రాణుల సంరక్షణ శాఖకు ఫిర్యాదు చేసింది. ఇలాంటి వేడుకలకు సింహం పిల్లను ఎలా అద్దెకు ఇస్తారని ప్రశ్నించింది. ఆ స్టూడియో ఆధీనంలో ఉన్న దానిని కాపాడాలని కోరింది.
 
మరోవైపు పెండ్లి ఫొటో షూటింగ్‌లకు పేరొందిన ఆ స్టూడియోపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ జేకేఎఫ్‌ జంతు సంరక్షణ సంస్థతోపాటు ప్రపంచవ్యాప్తంగా పలువురు ఆన్‌లైన్‌ వేదికగా డిమాండ్‌ చేశారు.