సోమవారం, 4 డిశెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 7 ఫిబ్రవరి 2023 (22:25 IST)

కిచ్చ సుదీప్‌, అమలాపాల్‌ హెబ్బులి విడుదలజి సిద్ధం

prasanna, c. kalyan and others
prasanna, c. kalyan and others
కిచ్చ సుదీప్‌, అమలాపాల్‌ నటించిన హెబ్బులి  చిత్రం కన్నడలో విడుదలై విమర్శకుల నుండి సానుకూల సమీక్షలను అందుకుంది.  సిఎమ్‌బి ప్రొడక్షన్స్‌ బ్యానర్‌ పై ఎమ్‌ మోహన శివకుమార్‌ సమర్పణలో సి.సుబ్రహ్మణ్యం నిర్మించిన చిత్రం హెబ్బులి. ఎస్‌కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ చిత్రం తెలుగులో డబ్బింగ్‌, సెన్సార్‌ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని విడుదల చేయడానికి చిత్ర నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర ట్రైలర్‌ను సీ కళ్యాణ్‌ లాంచ్‌ చేయగా మొదటి పాటను ప్రశన్నకుమార్‌ విడుదల చేసారు. తుమ్మల పల్లి సత్యనారాయణ రెండవ పాట విడుదల చేశారు. విలేఖరుల సమావేశంలో ...
 
ఈ సందర్భంగా  ప్రొడ్యూసర్‌ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ,  కన్నడలో హెబ్బులి సూపర్‌ కలెక్షన్లు సాధించింది. కాబట్టి నేను కూడా ఓ ఫ్యాన్సీ రేటు ఇచ్చి ఇక్కడ కొన్నాను అన్నారు. డిస్ట్రిబ్యూటర్‌ బాపిరాజు మాట్లాడుతూ విక్రాంత్‌ రోణా కంటే పెద్ద హిట్‌ కావాలని కోరుకుంటున్నాను. ఫిబ్రవరి  25న రెండు రాష్ట్రాలలో విడుదల చేస్తున్నాము. మరో నాలుగయిదు చిత్రాలు విడుదలకావలసి ఉన్నాయి. అవన్నీ కూడా హిట్‌ అవ్వాలని కోరుకుంటున్నాను.
 
సీ.కళ్యాణ్‌ మాట్లాడుతూ, ఎక్కడో పుట్టి ఇండస్ట్రీలో కలిసి పదవులను ఎంజాయ్‌ చేస్తున్నాము. అలాంటిది పక్కవాళ్లకి సహాయం చేయాలి, సినిమాలు తీయాలి. .డబ్బులు పోగొట్టుకోకూడదు. మూవీ కొన్నందుకు నిర్మాతకు మంచి లాభాలు రావాలని కోరుకుంటున్నాను అన్నారు.