గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By srinivas
Last Updated : గురువారం, 26 ఏప్రియల్ 2018 (09:23 IST)

తెలుగు హీరోల‌ను చూసి.. త‌మిళ హీరోలు నేర్చుకోవాలి..!

తెలుగు హీరోల‌ను చూసి... త‌మిళ హీరోలు నేర్చుకోవాలి. ఈ మాట కోలీవుడ్‌లో హాట్‌టాపిక్ అయ్యింది. ఇంత‌కీ విష‌యం ఏమిటంటే.. "నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా" త‌మిళ వెర్షెన్‌ని నిర్మాత స్టూడియో గ్రీన్ అధినేత జ్ఞా

తెలుగు హీరోల‌ను చూసి... త‌మిళ హీరోలు నేర్చుకోవాలి. ఈ మాట కోలీవుడ్‌లో హాట్‌టాపిక్ అయ్యింది. ఇంత‌కీ విష‌యం ఏమిటంటే.. "నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా" త‌మిళ వెర్షెన్‌ని నిర్మాత స్టూడియో గ్రీన్ అధినేత జ్ఞాన‌వేల్ రాజా రిలీజ్ చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా చెన్నైలో ఏర్పాటు చేసిన మీడియా మీట్‌లో జ్ఞాన‌వేల్ రాజా మాట్లాడుతూ... త‌మిళ హీరోలు తెలుగు హీరోల‌ను చూసి నేర్చుకోవాలి అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.
 
ఇలా అన‌డానికి కార‌ణం ఏమిటంటే... తెలుగులో రూ.100 కోట్ల క‌లెక్ట్ చేసే స్టార్ హీరోలు రూ.15 కోట్లు రెమ్యూన‌రేషన్ తీసుకుంటారు. కానీ.. త‌మిళ హీరోలు రూ.50 కోట్లు రెమ్యూన‌రేష‌న్ తీసుకుంటారు. అంతేకాకుండా.. తెలుగు హీరోలు నిజాయితీగా ఉంటారు. తెలుగు సినిమాలు చాలా రిచ్‌గా ఉంటాయి. అందుచేత బాలీవుడ్‌లో తెలుగు సినిమాల‌కు డిమాండ్ ఉందన్నారు. 
 
ఇదిలావుంటే... ఇటీవ‌ల జ్ఞాన‌వేల్ రాజా భార్య నేహ కొంత మంది హీరోయిన్స్ ప‌చ్చ‌ని సంసారంలో కూలుస్తున్నార‌ని.. వారి పేర్లు త్వ‌ర‌లోనే బ‌య‌ట‌పెడ‌తాను అంటూ సంచ‌ల‌న వ్యాఖ్యాలు చేసారు. భార్య హీరోయిన్స్‌పై, భ‌ర్త హీరోలపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసి వార్త‌ల్లో నిలిచారు. మ‌రి... జ్ఞాన‌వేల్ రాజా, నేహా చేసిన వ్యాఖ్య‌లపై కోలీవుడ్ ప్ర‌ముఖులు ఎలా స్పందిస్తారో చూడాలి..!