బుధవారం, 17 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 17 ఆగస్టు 2022 (09:23 IST)

నా స్వయంవరంలో రౌడీ హీరో వుండాలి.. కృతిసనన్

Kriti sanon
Kriti sanon
బాలీవుడ్ అగ్ర హీరోయిన్లలో కృతి సనన్ ఒకరు. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది. అలాగే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఆదిపురుష్ చిత్రంలోనూ నటిస్తుంది. డైరెక్టర్ ఓంరౌత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రోడక్షన్ పనులు జరుపుకుంటుంది. 
 
ఈ క్రమంలో తాజాగా కృతి సనన్ ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. తన పెళ్లి స్వయంవరంలో హీరోస్ కార్తీక్ ఆర్యన్, ఆదిత్య రాయ్ కపూర్, సౌత్ హీరో విజయ్ దేవరకొండ ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపింది. అంతేకాకుండా విజయ్ అందంగా ఉంటాడంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
 
విజయ్ దేవరకొండ చూడటానికి చాలా అందంగా ఉంటాడు. అతను చాలా సెన్సిబుల్‏గా ఉన్నాడు. ఇటీవల అతని ఇంటర్వ్యూలో చాలా చూశాను. అతను ఎంతో నిజాయితీగా.. సెన్సిటివ్‏గా కనిపిస్తున్నాడు. తన స్వయంవరంలో అతను ఉండాలని కోరుకుంటున్నానని తెలిపింది. అలాగే కార్తీక్ ఆర్యన్, ఆదిత్య రాయ్ కపూర్ కూడా ఉండాలని చెప్పింది.