శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శుక్రవారం, 31 డిశెంబరు 2021 (17:51 IST)

జనతాబార్ లో లక్ష్మి రాయ్

Lakshmi Roy
రాయ్‌లక్ష్మీ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం జనతాబార్. రమణ మొగిలి దర్శకుడు. సన్ షైన్ ఆర్ట్స్  అశ్వర్థనారాయణ సమర్పణలో రోచిశ్రీ మూవీస్  పతాకంపై నిర్మాణం జరుపుకుంటోంది. రెండు పాటలు మినహా షూటింగ్‌ను పూర్తిచేసుకున్న ఈ చిత్ర విశేషాలను దర్శకుడు రమణమొగిలి తెలియజేస్తూ రాయ్‌లక్ష్మీ కెరీర్‌లోనే ఇదొక డిఫరెంట్ చిత్రం. ఆమె పాత్ర చిత్రానికి హైలైట్‌గా వుంటుంది. 
 
బాలీవుడ్ నటుడు శక్తికపూర్ ని ఈ చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకి పరిచయం చేయడం గర్వంగా ఉందని  అన్నారు. స్పోర్ట్స్‌ను కెరీర్‌గా ఎంచుకున్న మహిళలపై ఆ స్పోర్ట్స్ ఉన్నతాధికారులు తమ అధికారాన్ని అడ్డుపెట్టుకుని  చేస్తున్న సెక్సువల్ హారాస్‌మెంట్‌కు చరమగీతం పాడటానికి పోరాడిన ఓ మహిళ కథ ఆధారంగా  కమర్షియల్ అంశాలతో  రూపొందుతున్న సినిమా ఇది. తప్పకుండా చిత్రం ఘనవిజయం సాధిస్తుందనే నమ్మకం వుందని ఈ చిత్రానికి కథ మాటలు స్క్రీన్ ప్లే  అందిస్తున్న  రాజేంద్ర భరద్వజ్ తెలియ చేశారు. 
 
శక్తికపూర్, ప్రదీప్‌రావత్, సురేష్, అనూప్‌సోని, అమన్ ప్రీత్, భూపాల్ రాజ్, విజయ్‌భాస్కర్, ఉన్ని కృష్ణ, దీక్షాపంత్, అమీక్ష, మిర్చిమాధవి, తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: వినోద్ యజమాన్య, కెమెరా: చిట్టిబాబు, ఎడిటింగ్: ఉద్ధవ్, ఆర్ట్: నాగు,  ఫైట్స్:డ్రాగన్ ప్రకాష్, మల్లేష్, చిత్ర నిర్మాణం దర్శకత్వం: రమణ మొగిలి, సహా నిర్మాత: అజయ్ గౌతం.