వెన్ను నొప్పితో బాధపడ్డ లావణ్య, ఏం చేసిందో చూడండి!
కరోనాను కాలితో ఇలా తన్ని పారదోలలేం. కానీ వెన్నునొప్పిని ఇలా తన్ని పారిపోయేలా చేయొచ్చని లావణ్య త్రిపాఠి చెబుతోంది. కరోనా సెకండ్ వేవ్ వల్ల చాలామంది హీరోయిన్లు తగిన జాగ్రత్తలు తీసుకంటూనే వున్నారు. మరీ ఇంటిలో ఎక్కువ సేపు కూర్చున్న ఏదో ఒకటి పెయిన్ వస్తుంది. నటి లావణ్య రెగ్యులర్‌గా తగిన వ్యాయామాలు చేస్తూనే వుంటుంది.
అయితే గ్లామర్ నటి లావణ్య త్రిపాఠి గత రెండు రోజులుగా వెన్నెనొప్పితో బాధపడుతోంది. దీనికోసం డాక్టర్‌ను సంప్రదిస్తే ఆ టెస్ట్, ఈ టెస్ట్ అంటూ భయపెట్టేస్తాడు. ఇది సహజంగా జరుగుతున్నదే. కానీ లావణ్య అలా భయపెట్టేవారి దగ్గరకు వెళ్ళకుండా దానికోసం ఏం చేయాలని తన ట్రైనీ అశ్విన్‌ని అడిగింది. ఆమె అభ్యర్థన మేరకు ఇలా వ్యాయామం తరహా డాన్స్‌ను చేయమని సూచించాడు. వెంటనే లావన్య ఇలా రెండు ఫోజులు ఇచ్చింది. ఫుట్‌బాల్ ఆడే తరహాలో వున్న ఈ ఫోజ్ డాన్స్‌లోని ఓ భంగిమ. దాంతో దెబ్బకు వెన్నె నొప్పి పోయింది అంటూ లావణ్య సోషల్ మీడియా పోస్ట్ చేసింది.
ఈ ఫోజ్
తనకు బాగా నచ్చిందని నీహారిక కొణిదల కితాబిచ్చింది. ఆమెతోపాటు పలువురు ఈ ఫోజ్‌ను మెచ్చుకుంటూనే చిరునవ్వు, అందం ఏ మాత్రం తగ్గలేదని ప్రశంసిస్తున్నారు. వారందరికీ థ్యాంక్స్ చెబుతూ, ఈ క్రెకెట్ అశ్విన్‌కు చెందుతుందని తెలియజేస్తుంది. ఇంకేం వెన్నె నొప్పి వస్తే ఇలా వ్యాయామం చేస్తే సరిపోతుంది సుమా. తన అనుభవంతో చెబుతున్న లావణ్యను ఫాలో అవ్వవచ్చు. ఇందులో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ వుండవని అశ్విన్ చెబుతున్నాడు. సో.. మంచి టెక్నిక్ ఇది.