శనివారం, 28 సెప్టెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 31 అక్టోబరు 2023 (11:56 IST)

నిహారిక బాటలో లావణ్య త్రిపాఠి.. అవసరమా.. వర్కౌట్ అవుతుందా?

Niharika-Chiru
మెగా డాటర్ నిహారిక బాటలో హీరోయిన్ లావణ్య త్రిపాఠి పయనిస్తోంది. మెగా డాటర్ తరహాలో హల్దీ వేడుకలో లావణ్య త్రిపాఠి తన తల్లిని చీరను కట్టుబోతున్నట్లు తెలుస్తోంది. తల్లి జ్ఞాపకంగా ఉండాలని ఆమె అలా చేస్తుందట. 
 
అయితే గతంలో నిశ్చితార్థానికి మెగా డాటర్ నిహారిక కొణిదెల కూడా ఇలాగే తల్లి చీరను కట్టుకుంది. అయితే బ్లౌజు మాత్రం స్పెషల్‌గా డిజైన్ చేయించుకున్న నిహారిక ఆ చీర కట్టుకొని తెగ మురిసిపోయింది. ప్రస్తుతం తల్లి చీరనే లావణ్య కట్టుకోనుందనే వార్త నెట్టింట వైరల్ అవుతోంది. 
 
కానీ మెగా డాటర్ నిహారికలా తల్లి చీరను లావణ్య త్రిపాఠి కట్టుకోవడం అవసరమా అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మెగా డాటర్స్ అందరూ విడాకుల బాటలో వున్నారు. నిహారికకు కూడా అదే జరిగింది. పెళ్లి అన్నాక కొత్త బట్టలు ధరించాలని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. 
 
అందుకే నెటిజన్లు లావణ్యకు తల్లి చీరను ధరించ వద్దని సలహా ఇస్తున్నారు. మెగా డాటర్స్ కే కాదు ఈ సెంటిమెంట్ అక్కినేని ఫ్యామిలీకి కూడా వర్కౌట్ కాలేదు. ఎందుకంటే.. హీరోయిన్ సమంత కూడా తన పెళ్లిలో చైతూ బామ్మ చీరనే ధరించింది. ఆ చీరతోనే మూడు ముళ్లు వేయించుకుంది. అందుకే ఈ ఘటనలను గుర్తు పెట్టుకుని లావణ్య త్రిపాఠి.. కొత్త చీరలను పెళ్లి వేడుకలో ధరించాలని నెటిజన్లు సూచిస్తున్నారు. 
 
గతంలో కూడా చాలా మంది స్టార్ హీరోయిన్లు ఇలాగే వారి తల్లుల చీరలను కట్టుకొని మురిసిపోయారు. ముఖ్యంగా బాలీవుడ్ హాట్ బ్యూటీ కరీనా కపూర్, యామీ గౌతమ్, మిహీకా బజాజ్, అలియా భట్.. ఇలా స్టార్ హీరోయిన్లు అందరూ ఇదే పద్ధతి ఫాలో అయ్యారు. 
 
ఎన్ని చీరలు ఉన్నా, ఎంత ధర పెట్టినా.. తల్లి చీర ముందు అవేవీ పనికి రావని నిరూపించడంలో వీరిని మించిన వారు లేరు. బట్ సెంటిమెంట్ టాలీవుడ్‌లో వర్కౌట్ కాలేదనే చెప్పాలి.