ఆదివారం, 26 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 3 అక్టోబరు 2019 (18:30 IST)

రాఘవ లారెన్స్ నిర్మాత.. ''కాంచన''గా అక్షయ్ కుమార్.. ఫస్ట్ లుక్

రాఘవ లారెన్స్ కథానాయకుడిగా నటించిన కాంచన సినిమా భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ సినిమాను హిందీలో 'లక్ష్మీ బాంబ్' టైటిల్ తో రీమేక్ చేస్తున్నారు. అక్షయ్ కుమార్ కథానాయకుడిగా చేస్తోన్న ఈ సినిమాకి కూడా లారెన్స్ దర్శకత్వం వహిస్తుండటం విశేషం. ఇప్పటికే ఈ సినిమా చాలా వరకూ చిత్రీకరణను జరుపుకుంది. తాజాగా ఈ సినిమా నుంచి కొత్త పోస్టర్‌ను వదిలారు. 
 
కాళికాదేవి ఆలయంలో ఎర్రచీరతో హిజ్రా లుక్‌తో అక్షయ్ కుమార్ కనిపిస్తున్నాడు. తన కుటుంబానికి అన్యాయం చేసిన ఒక వ్యక్తిని అంతం చేసే ప్రయత్నంలో భాగంగా 'కాంచన'లో లారెన్స్ నరసింహ స్వామి ఆలయంలోకి వెళతాడు. ఆ సన్నివేశాన్ని హిందీలో కాళికాదేవి ఆలయంలో ప్లాన్ చేసి వుంటారు. అందుకు సంబంధించిన పోస్టర్నే ప్రస్తుతం విడుదల చేశారు. వచ్చే ఏడాది వేసవి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.