శనివారం, 23 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 13 సెప్టెంబరు 2020 (11:51 IST)

స్వరం పెంచితే అంతే.. కంగనాకు మాధవీలత సపోర్ట్.. గవర్నర్‌ను కలవనున్న మణికర్ణిక

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి తర్వాత డ్రగ్స్ కేసు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. డ్రగ్స్ కేసులో రియా చక్రవర్తి రకుల్ ప్రీత్ సింగ్ సహా బాలీవుడ్ ప్రముఖుల పేర్లను వెల్లడించడం తో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. 
 
ఈ నేపథ్యంలో టాలీవుడ్ నటి బీజేపీ నాయకురాలు మాధవీలత మరోసారి నోటికి పనిచెప్పింది. బాలీవుడ్‌లో కలకలం సృష్టిస్తున్న డ్రగ్స్ కేసుపై ఆమె స్పందించింది. బాలీవుడ్‌లో డ్రగ్స్ కేసు వెనుక మాఫియా ఉందని, పరిశ్రమలో మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా స్వరం పెంచడం వల్ల నటి కంగనా రనౌత్ ఎదుర్కొంటున్న పరిణామాలను చూస్తున్నామని మాధవి లత వ్యాఖ్యానించింది. పార్టీ కల్చర్ దక్షిణ పరిశ్రమ వైపు నెమ్మదిగా వ్యాపిస్తోందని మాధవీల అన్నారు. ఇందులో అధికారుల వైఫల్యం కూడా కనిపిస్తుందని పేర్కొంది.  
 
కాగా.. శివసేన కూటమి సర్కార్ వర్సెస్ నటి కంగనా రనౌత్ అన్నట్లుగా సాగుతోన్న వివాదాల పరంపరలో కీలక మలుపు చోటుచేసుకోనుంది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య ఉదంతంలో మహారాష్ట్ర పోలీసుల తీరుపై తీవ్ర విమ్శలు చేయడం, ముంబైని పాక్ ఆక్రమిత కాశ్మీర్‌గా అభివర్ణించడంతో నటిపై ఆగ్రహించిన ప్రభుత్వం... జుహూలోని ఆమె కార్యాలయాన్ని పడగొట్టడం తెలిసిందే. ఆ తర్వాత మరింత దూకుడు పెంచిన కంగన.. సీఎం ఉద్ధవ్ ఠాక్రేపై నేరుగా యుద్ధాన్ని ప్రకటించింది. ఈ క్రమంలో ఆమెకు బీజేపీ సహా ఎన్టీఏలోని పలు పార్టీలు మద్దతుగా నిలిచాయి.
 
తాజాగా..తనపై కేసులు, బిల్డింగ్ కూల్చివేత అంశాలపై మహారాష్ట్ర గవర్నర్ కు ఫిర్యాదు చేసేందుకు కంగనా రనౌత్ రెడీ అయ్యారు. ముంబైలోని రాజ్ భవన్‌లో ఆదివారం సాయంత్రం 4.30కు ఆమెకు గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ అపాయింట్మెంట్ ఇచ్చారు. శివసేనతో వివాదం నేపథ్యంలో కంగన గవర్నర్‌ను కలవనుండటం చర్చనీయాంశమైంది.